నిర్మాతగా తరుణ్ కొత్త అవతారం

లవర్‌ బాయ్ గా తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓక స్థానాన్ని సంపాదించుకున్న తరుణ్ ఇప్పుడిక నిర్మాతగా మారుతున్నట్లు చెప్పాడు. త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు పేర్కొన్నాడు. అందులో రెండు వెబ్‌సీరిస్‌లు కాగా, మరొకటి తను హీరోగా నటించనున్న సినిమా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో వీటికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తరుణ్ పేర్కొన్నాడు. ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన తరుణ్.. వరుస విజయాలతో […]

నిర్మాతగా తరుణ్ కొత్త అవతారం
Follow us

|

Updated on: Oct 30, 2020 | 7:05 PM

లవర్‌ బాయ్ గా తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓక స్థానాన్ని సంపాదించుకున్న తరుణ్ ఇప్పుడిక నిర్మాతగా మారుతున్నట్లు చెప్పాడు. త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు పేర్కొన్నాడు. అందులో రెండు వెబ్‌సీరిస్‌లు కాగా, మరొకటి తను హీరోగా నటించనున్న సినిమా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో వీటికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తరుణ్ పేర్కొన్నాడు. ‘నువ్వే కావాలి’ చిత్రంతో హీరోగా తెరంగ్రేటం చేసిన తరుణ్.. వరుస విజయాలతో దూసుకెళ్లాడు. అయితే, ఆతర్వాత వరుస ప్లాపులతో హీరోగా దాదాపు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.