రేపు కేసీఆర్‌తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ.. షూటింగ్స్ నిర్వహణపై కీలక చర్చ

శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు. గురువారం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగార్జునతో పాటు పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు..

రేపు కేసీఆర్‌తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ.. షూటింగ్స్ నిర్వహణపై కీలక చర్చ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 22, 2020 | 11:07 AM

శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు. గురువారం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగార్జునతో పాటు పలువురు టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు చివరి దశలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌ల గురించి చర్చించారు. అలాగే సినీ కార్మికుల కష్టాల గురించి కూడా చిరంజీవి ప్రస్తావించారు. దీంతో వారిని దృష్టిలో పెట్టుకుని అయినా సినిమా షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వాలని నిన్న మంత్రి తలసానిని కోరారు చిరంజీవి. అయితే సినిమా షూటింగ్‌లు ప్రారంభించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షూటింగ్స్ ఎలా తక్కువ మందితో చేస్తారు? అనేదానిపై ఒక డెమో వీడియో ప్రభుత్వానికి ఇవ్వాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్‌ని ఒక వీడియో రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో రేపు సీఎం కేసీఆర్‌ని కలవబోతున్నారు తెలుగు సినీ పెద్దలు. కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా మూవీ షూటింగ్స్‌ చేసుకోవాడనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి దీనిపై సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

ఇది కూడా చదవండి: 

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..