‘లయన్ కింగ్‌’ మూవీకి కామెడీ స్టార్స్ వాయిస్..!

Lion king Movie, ‘లయన్ కింగ్‌’ మూవీకి కామెడీ స్టార్స్ వాయిస్..!

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ‘లయన్ కింగ్’. మొదట కార్టూన్ నెట్‌‌‌వర్క్‌‌లో కామిక్ సీరియల్‌గా ప్రారంభమైన ‘లయన్ కింగ్’ ఆ తర్వాత డిస్నీ 2డీ యానిమేటెడ్ సినిమాగా 1990లలో విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను జోడించి 3డీ యానిమేటెడ్ సినిమాగా రూపొందించారు.

తాజాగా.. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్‌ అయిన అడవి పంది, ముంగిసకు టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు డబ్బింగ్ చెప్పారు. అడవి పందికి బహ్మానందం, ముంగిసకు ఆలీ తమ గొంతుకను అందించారు. ఈ సినిమాలో అడవి పంది పేరు పుంబా, ముంగిస పేరు టింబా. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన సినిమా జులై 19న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *