Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని నివాసంలో సుదీర్గంగా సాగిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం. మోడీ పాలన రెండవ విడత లో ఏడాది పూర్తయిన తరువాత తొలిసారి జరిగిన కేబినెట్ భేటీ. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ నిర్ణయాలు ప్రకటించనున్న కేంద్రమంత్రులు. దేశ ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎగ్జిట్ ప్లాన్,చైనా భారత్ సరిహద్దు వివాదం అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు. తిరువనంతపురంలో భారీ వర్షం. వాతావరణ శాఖ అంచనాల మేరకు కదులుతున్న రుతుపవనాలు. రెండు వారాల్లో దక్షిణాది మొత్తం విస్తరించే అవకాశం.
  • చెన్నై : కోలీవుడ్ లో ముదురుతున్న గాడ్ మాన్ వెబ్ సిరీస్ వివాదం. గాడ్ మాన్ వెబ్ సిరీస్ ట్రైలర్,టీజర్ ని విడుదల చేసిన నిర్మాణ సంస్థ . ట్రైలర్ లో బ్రహ్మనులను కించపరుస్తూ సంభషణలు ,సన్నివేశాలుండడం ఫై బీజేపీ నేతలు,హిందూ సంఘాలు ఆగ్రహం . నిర్మాణ సంస్థ ,దర్శకుడి ఫై పోలీసులకు ఫిర్యాదు ,6 సెక్షన్ లలో కేసు నమోదు చేసిన పోలీసులు . ట్రైలర్ ,టీజర్ లను యూట్యూబ్ నుండి తొలగించిన నిర్మాణ సంస్థ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

యురేనియంపై సినీ ప్రముఖుల గుస్సా..! ఆగిన తవ్వకాలు

Tollywood Celebrities responded on Uranium Mining, యురేనియంపై సినీ ప్రముఖుల గుస్సా..! ఆగిన తవ్వకాలు

గత కొద్ది రోజులుగా తెలంగాణలో యురేనిం తవ్వకాలపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ప్రెజెంట్.. హాట్‌ టాపిక్ ఏదంటే.. ‘యురేనియం మైనింగ్’. కాగా.. గత కొన్ని రోజుల నుంచి దీనిపై మామూలుగా.. రచ్చ నడవటం లేదు. టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ మొదలు పెట్టిన దగ్గర్నుంచీ.. పలువురు సినీ సెలబ్రెటీలు దీన్నిపై దృష్టి పెట్టి.. తమ ట్విట్టర్లలలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై ట్వీట్ల వర్షం కురిపించారు. నాగార్జున కోడలు అక్కినేని సమంత ఏకంగా.. ‘సేవ్ నల్లమల్ల’ ఫొటోను తన ట్విట్టర్‌ డీపీగా దీన్ని పెట్టుకున్నారు. అలాగే.. జబర్దస్త్ యాంకర్ అనసూయ దీనిపై మాట్లాడుతూ.. నోరు జారింది కూడా. అనంతరం క్షమాపణలు కూడా చెప్పింది.

యురేనియం తవ్వకాలవల్ల నల్లమల్ల అడవుల్లోని చెట్లు నశిస్తాయని, అలాగే.. సమీప నదుల్లోని జలాలు కలుషితం అవుతాయని, గిరిజనుల పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతాయని.. వీరు ట్వీట్లలో పేర్కొన్నారు. ‘సేవ్ నల్లమల్ల పేరిట.. ట్వీట్ల ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు’. ఇప్పటికే.. నల్గొండ జిల్లాలో.. యురేనియం తవ్వకాలను ఆపివేయాలంటూ.. కాంగ్రెస్, టీజేఎస్ సహా విపక్షాలు కూడా ఇటీవలే నిరసన ప్రదర్శనలకు పూనుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంపై జనసేనాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. యురేనియం కోసం తవ్వకాలు చేపట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని.. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఆ సందర్భంగా.. ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసే వరకూ ఈ పరిస్థితి వెళ్లింది. తాజాగా.. టాలీవుడ్ సైతం ‘సేవ్ నల్లమల్ల’ అంటూ.. స్పందించడంతో.. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. చివరకు ఇది రాజకీయ దుమారం కాకుండా జాగ్రత్త పడిందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. అక్కినేని సమంత, విజయ దేవర కొండ, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు షట్లర్ గుత్తా జ్వాలా వంటి వారు కూడా తమ ట్వీట్లలో దీనిపై తీవ్రంగా స్పందించడం విశేషం.

చివరకు.. ఏదైతేనేం.. యురేనియం తవ్వకాల అంశం తెరమరుగయ్యింది. మంత్రి కేటీఆర్‌ తాజాగా.. ఈ విషయంపై ఆదివారం చేసిన ప్రకటనే.. ఇందుకు నిదర్శనం. నల్లమల్ల యురేనియం తవ్వకాలపై అనుమతులు ఇవ్వమంటూ.. శాసనమండిలో స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్. అలాగే.. సీఎం కేసీఆర్.. ఈ రోజు అసెంబ్లీలో కూడా యురేనియం తవ్వకాలపై స్పందించారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వమని.. అవసరమైతే.. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదం.. అంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్.. పేర్కొన్నారు.

అసలు యురేనియం తవ్వకాలు చేస్తే.. దాంతో.. అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనివల్ల సునామీలు వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అంతేకాదు విద్యుత్ వాడకంలో ఉపయోగించే.. న్యూక్లియర్ అణువులతో అణుబాంబులు తయారు చేస్తారు. ప్రమాదవశాత్తు అవి బ్లాస్ట్ అయితే మానవాళికే పెద్ద ముప్పు వచ్చి పడుతుంది. అందుకే.. చిన్నవారి నుంచి.. పెద్దవారి దాకా దీనిపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Related Tags