2020 ఒలింపిక్ టార్చ్

2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టార్చ్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. జపాన్‌ సంప్రదాయ పుష్పం ‘సకురమోన్‌ (చెర్రీ బ్లోసమ్‌)’ స్ఫూర్తితో యోషియోక టొకుజిన్‌ దీనిని రూపొందించాడు. రోజ్‌ గోల్డ్‌ వర్ణంలో మెరిసిపోతున్న ఈ టార్స్‌ 71 సెంటీ మీటర్ల పొడవు, 1.2 కిలోల బరువు ఉంటుంది. 2011 సునామీ బాధితుల కోసం నిర్మించిన ఇళ్లకు ఉపయోగించిన అల్యూమినియం వ్యర్థాలను టార్చ్‌ తయారీలో వాడినట్టు ఒలింపిక్స్‌ నిర్వాహకులు తెలిపారు. 2020, మార్చి 26న మొదలుకానున్న టార్చ్‌ […]

2020 ఒలింపిక్ టార్చ్
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2019 | 6:32 PM

2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన టార్చ్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. జపాన్‌ సంప్రదాయ పుష్పం ‘సకురమోన్‌ (చెర్రీ బ్లోసమ్‌)’ స్ఫూర్తితో యోషియోక టొకుజిన్‌ దీనిని రూపొందించాడు. రోజ్‌ గోల్డ్‌ వర్ణంలో మెరిసిపోతున్న ఈ టార్స్‌ 71 సెంటీ మీటర్ల పొడవు, 1.2 కిలోల బరువు ఉంటుంది. 2011 సునామీ బాధితుల కోసం నిర్మించిన ఇళ్లకు ఉపయోగించిన అల్యూమినియం వ్యర్థాలను టార్చ్‌ తయారీలో వాడినట్టు ఒలింపిక్స్‌ నిర్వాహకులు తెలిపారు. 2020, మార్చి 26న మొదలుకానున్న టార్చ్‌ రిలే.. వివిధ ప్రాంతాల్లో పర్యటించి జూలై 10న జపాన్‌ రాజధాని టోక్యోకు చేరుకోనుంది.