Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.

వరుడి ఇంట్లో టాయిలెట్ ఉంటే.. వధువుకి బంపర్ ఆఫర్..!

A Pre-wedding Shoot to Forget: Why 'Selfie With Loo' Has Become a Marriage Ritual in MP, వరుడి ఇంట్లో టాయిలెట్ ఉంటే.. వధువుకి బంపర్ ఆఫర్..!

స్వచ్చ భారత్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో షాదీ ముబారక్ తరహాలో అక్కడ కూడా ఓ స్కీమ్ తీసుకొచ్చింది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. పెళ్లి తర్వాత అమ్మాయి.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లడం ఆనవాయితీ. స్వచ్ఛ భారత్‌లో భాగంగా పెళ్లి చేసుకునే వరుడు.. తన ఇంట్లోని టాయిలెట్ వద్ద నిలబడి సెల్ఫీ పంపించాలని ఇప్పటి నుంచి ఈ ఆచారాన్ని అందరూ పాటించాలని భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. భోపాల్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం పాటించాలని చెప్పారు. పెళ్లికి ముందు వరుడి ఇంట్లో టాయిలెట్ ఉందని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.

పథకం ప్రకారం, పాలసీలో సడలింపు ఉండేది. వధూవరులకు వారి వివాహానికి ముందు టాయిలెట్ నిర్మించడానికి 30 రోజుల సమయం ఇచ్చేవారు. తాజాగా దానిని తొలగిస్తూ.. కొత్త పాలసీని అమలులోకి తీసుకొచ్చారు. టాయిలెట్‌తో ఉన్న వరుడి ఫోటోను.. పెళ్లికి ముందు చూపించడంలో తప్పు లేదని.. ఇప్పటి నుంచి ఈ పాలసీని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు రఫీక్ ఖురేషి తెలిపారు. ఇది స్వచ్ఛ భారత్‌లో భాగమని చెప్పారు. ఎవరైతే పెళ్లికి ముందే తమ అత్తవారింట్లో టాయిలెట్ ఉందని నిరూపిస్తారో వారికి ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 18న అధికారంలోకి వచ్చిన రెండో రోజే.. ఈ పాలసీలో అప్పటి వరకు ఉన్న ఆర్టిక సహాయాన్ని రూ.28 వేల నుంచి రూ.51 వేలకు పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వేలకు పైగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ప్రతి ఇంటిని టాయిలెట్ కోసం అంచనా వేయడం అధికారులకు కష్టతరంగా మారింది. అందుకే కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.

Related Tags