చిట్టి చెల్లి కోసం.. పుట్టెడు కష్టం.. బుడ్డోడు గట్టోడే..!

Toddler cooks Egg Fried Rice, చిట్టి చెల్లి కోసం.. పుట్టెడు కష్టం.. బుడ్డోడు గట్టోడే..!

తన చిట్టి చెల్లెలు ఆకలిని గమనించిన ఓ బుడ్డోడు తానే అమ్మగా మారిపోయాడు. పెద్ద గరిట సైజ్‌ కూడా లేని ఆ పిల్లాడు తన చేతికి సరిపోయే గరిటను పట్టి ప్రొఫెషనల్ చెఫ్‌గా మారి అద్భుతమైన ఫ్రైడ్ రైస్ చేశాడు. ఆ తరువాత తానే సొంతంగా తన చెల్లికి తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఎక్కడ తీశారో తెలీదు కానీ ఫెస్ అనే ఓ నెటిజన్ ఇటీవల దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అందులో మొదట ఓ ప్యాన్‌లో గుడ్డు, తరువాత కొన్ని టమాటాలు, అన్నం, ఉప్పు, కొత్తిమీరతో పాటు కొన్ని పదార్థాలను వేసిన బుడ్డోడు చివరకు అద్భుతమైన ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను చేశాడు. ఆ తరువాత దాన్ని రెండు గిన్నెల్లో పెట్టుకొని తన చెల్లి దగ్గరకు తీసుకెళ్లి ఆమెకు తినిపించాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. వాడి టాలెంట్‌, చెల్లిపై చూపించే ప్రేమకు ముగ్ధులవుతూ.. ‘వావ్’ అని కామెంట్లు పెడుతున్నారు. ‘బుడ్డోడా నువ్వు అదుర్స్’ అంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *