Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • ప్రధాని అయోధ్య పర్యటన: రేపు ఉదయం 9.35 కు ఢిల్లీ నుంచి బయలుదేరి 10.35కు లక్నో చేరుకుంటారు. 10.40కు లక్నో నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి 11.30కు అయోధ్యలో సాకేత్ కళాశాల మైదానంలో దిగుతారు. అక్కణ్ణుంచి నేరుగా 11.40కు హనుమాన్ గడి చేరుకుని 10 నిమిషాలు దర్శనం. అక్కణ్ణుంచి భూమి పూజకు బయలుదేరుతారు. 12.15కు ఆలయ ప్రాంగణంలో ఒక పారిజాత మొక్క నాటుతారు. 12.30కు భూమి పూజ ప్రారంభం. 12.44కు భూమి పూజ. శంఖుస్థాపన. 2.05కు తిరిగి సాకేత్ కాలేజ్ చేరుకుని, 2.20కి తిరుగు ప్రయాణం.
  • ముఖ్యమంత్రి సమీక్ష మరి కాసేపట్లో ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. పాల్గొననున్న సీఎంఓ నీటిపారుదల శాఖ అధికారులు.
  • మ‌ర్డ‌ర్ నిర్మాత‌ల‌కు అమృత నోటీసులు: మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌ల‌కు కోర్టు నోటీసులు. న‌ల్గొండ‌ డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి నోటీసులు పంపిన అమృత‌. త‌న క‌థ ఆధారంగా సినిమా తీస్తున్న‌ట్టు అమృత పిటిష‌న్ . మ‌ర్డ‌ర్ సినిమా నిర్మాత‌లు న‌ట్టి క్రాంతి, న‌ట్టి క‌రుణ‌, రామ్‌గోపాల్ వ‌ర్మ‌. వ‌ర్మ‌, క‌రుణ‌కు మాత్ర‌మే అమృత నోటీసులు. మ‌ర్డ‌ర్ సినిమాను ఆపాల‌ని, ప‌బ్లిసిటీ ఆపమ‌ని కోరుతూ కోర్టుకెళ్లిన అమృత‌. ఈ నెల 6న నిర్మాత‌లు హాజ‌రు కావాల‌ని కోర్టు నోటీసులు. నిర్మాత‌ల‌ను త‌మ వాద‌న వినిపించ‌మ‌న్న కోర్టు.
  • 30 ఇయ‌ర్స్ పృథ్వికి క‌రోనా పాజిటివ్‌. గ‌త ప‌ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాను. అన్ని చోట్ల చూపించా. కొన్ని చోట్ల కోవిడ్ నెగ‌టివ్ అన్నారు. సీటీ స్కాన్‌లు చేయించాను. డాక్ట‌ర్లు... `కొన్నిచోట్ల‌ నెగ‌టివ్ రావ‌చ్చు...` 15 రోజులు క్వారంటైన్‌లో జాయిన్ అవ్వ‌మ‌న్నారు. నిన్న మిడ్‌నైట్ క్వారంటైన్‌లో జాయిన్ అయ్యాను. అంద‌రి ఆశీస్సులు, వెంక‌టేశ్వ‌ర స్వామి ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నా మంచి ఆరోగ్యం కోసం పోరాడుతున్నాను.
  • ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు.

నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..?

Today Petrol and Diesel Rates in Hyderabad, నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..?

గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తున్నాయి. ఇంతకుముందు ధరలతో పోల్చితే.. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.77.26 కాగా.. డీజిల్ లీటర్ రూ.71.75గా ఉంది. అలాగే.. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.75.50 కాగా.. డీజిల్ లీటర్ ధర రూ.69.50గా ఉంది. ఇక ఢిల్లీలో అతి తక్కువగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.60 కాగా.. లీటర్ డీజిల్ రూ.65.75గా ఉంది. అయితే.. అక్టోబర్ నెలతో పోల్చితే.. ఇందనం ధరలు భారీగానే తగ్గాయని చెప్పవచ్చు. దాదాపు 3 రూపాయలు తేడా కనిపిస్తుంది.

అందుకు కారణాలేంటంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అందువల్ల ఇందనం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. కాగా.. అలాగే.. అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయి.

అక్టోబర్ నెలలో పెట్రోల్‌ ధరలు హయ్యెస్ట్ రికార్డును దాటాయి. అప్పుడు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.25గా నమోదయ్యింది. ఇక డీజిల్ లీటర్ ధర రూ.73.52గా ఉంది. దీంతో పోల్చితే.. ఇప్పుడు ఇందనం ధరలు కాస్త తగ్గాయనే చెప్పవచ్చు. దుబాయ్‌లో పెట్రోల్ బావులపై దాడి కారణంగా.. భవిష్యత్తులో ఇందనం ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నా.. అందుకు విరుద్ధంగా ధరలు తగ్గుతూ వచ్చాయి.

Today Petrol and Diesel Rates in Hyderabad, నెల రోజుల్లో.. భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు..! కారణం అదేనా..?

Related Tags