Breaking News
  • విజయవాడ: ఎపీఎస్ ఆర్టీసీలో కరోనా కలవరం. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ 4500 మంది ఆర్టీసీ సిబ్బంది. కరోనా కారణంగా 72 మంది మరణించినట్లు తెలిపిన ఆర్టీసీ. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు 5లక్షల పరిహారం ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం. కార్మికుల ఒక రోజు వేతనాన్ని జమ చేసి మృతులకుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయం. త్వరలో రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తాం. ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.
  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పెరుగుతున్న భారతరత్న డిమాండ్లు. రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసిన నటి, మాజీ ఎంపీ జయప్రద. భారతరత్న బాలుకి ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్న జయప్రద. సినీ సంగీతానికి, భారత చలనచిత్ర పరిశ్రమకు బాలు ఎనలేని సేవలు చేశారని లేఖలో పేర్కొన్న జయప్రద.
  • నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో భారీ మెజారిటీయే లక్ష్యం... టీఆర్ఎస్ నేతల పకడ్బందీ వ్యూహం. జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుస సమావేశాలు..నియోజకవర్గాల వారీగా నేతలకు భాద్యతలు. మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వానికి ‌మద్దతుగా, టీఆర్ఎస్ వైపు నిలుస్తున్న కాంగ్రెస్, బీజేపీ ల స్థానిక ప్రజాప్రతినిధులు. పోలింగ్ ‌నాటికి 90% ఓటర్లు టీఆర్ఎస్ వైపు ఉండే అవకాశం.
  • బయటపడుతున్న ఎస్బీ సిఐ చంద్రకుమార్ అరాచకాలు. లైంగిక వేదింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై చర్యలు తీసుకోవట్లేదని బాధితురాలు అవేదన. సర్టిఫికెట్ మిస్సింగ్ కేసులో సిఐకి పరిచయమైన మహిళ . సాయం అడిగిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన సిఐ చంద్రకుమార్. వనస్థలిపురం పిఎస్ లో సిఐ చంద్రకుమార్ పై కేసు. నగ్నంగా ఉన్న వీడియోలు మహిలకు పంపి సిఐ వేదిస్తున్నాడని మహిళ పిర్యాదు. సిఐ పై కఠిన చర్యలు తీసుకోవట్లేదని మహిళ పలు సాక్షాలు మీడియాకు విడుదల.
  • చెన్నై : చెన్నై మహానగరం లో కిలోల్లో దొరికిన డ్రగ్స్ . చెన్నై రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న వాల్ టాక్స్ రోడ్ లో 25 కిలోల మాదక ద్రవ్యాలను పట్టుకున్న డిఆర్ఐ అధికారులు తమిళనాడు , కేరళ , రాష్ట్రం లోఉన్న డ్రగ్స్ గ్యాంగ్ యూరోపియన్ దేశాలనుండి అక్రమంగా డ్రగ్స్ దిగుమతిని గుర్తించిన అధికారులు . అధికారులకు ఉన్న సమాచారం తో తనిఖీలు నిర్వహించగా 25 కిలోల ( పేశాడో ) డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు. చెన్నై నుండి ఎర్నాకులం కి పార్సెల్ ద్వారా సరఫరా చేస్తునట్టు గుర్తింపు. డ్రగ్స్ ని స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టిన డిఆర్ఐ అధికారులు.
  • ఫారెన్ ఇంగ్లీష్ యూనివర్సిటీ వి సి పేరుతో నకిలీ ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు. యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు తాను మీటింగ్ లో ఉన్నానని.. అర్జెంటుగా అమెజాన్ కుపన్స్ కొనాలని మెయిల్ పంపించిన సైబర్ నేరగాళ్లు. అలర్ట్ అయిన ఉద్యోగులు వీసీ సురేష్ కుమార్ కు సమాచారం ఇవ్వడంతో.. తాను అట్లాంటిది ఏమీ పంపించలేదని చెప్పిన విసి. హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్. ట్విటర్ ద్వారా వెల్లడించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం. రొటీన్‌గా నిర్వహించే పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ. ఎలాంటి లక్షణాలు లేవని, హోం ఐసోలేషన్లో ఉన్నారని వెల్లడి. ఆయన భార్య ఉష పరీక్ష ఫలితం నెగెటివ్. ముందుజాగ్రత్తలో స్వీయ ఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడి.

గుడ్ న్యూస్…భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర‌లు

ఇటీవ‌ల భారీ స్థాయిలో ఎగ‌సిబ‌డిన వెండి, బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి.

Latest Gold Silver Rates, గుడ్ న్యూస్…భారీగా త‌గ్గిన వెండి, బంగారం ధ‌ర‌లు

-భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-రూ.1,317 తగ్గిన ప‌సిడి ధర
– వెండి ధర ఏకంగా రూ. 2,900కు త‌గ్గుద‌ల‌
రూపాయి విలువ‌ బలపడటమే కారణమంటున్న బులియన్ నిపుణులు

Gold Rate Today : ఇటీవ‌ల భారీ స్థాయిలో ఎగ‌సిబ‌డిన వెండి, బంగారం ధ‌ర‌లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌ది గ్రాములు ప‌సిడి ధ‌ర రూ. 1,317 తగ్గి రూ. 54763 కు చేరుకుంది. బంగారంతో పాటే వెండి ధ‌ర కూడా భారీగా త‌గ్గింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2943 తగ్గి, ప్ర‌స్తుతం రూ. 73600 కు ప‌త‌న‌మైంది.

ఇదే క్ర‌మంలో ముంబైలో స్వచ్ఛమైన గోల్డ్ ధర రూ. 1564 తగ్గి, రూ. 53951కి చేరింది. కిలో వెండి ధర రూ. 2397 తగ్గి రూ. 71211 కు త‌గ్గింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ‌ మార్కెట్ పైనా పడిందనేది బులియన్ విశ్లేషకుల అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే క్ర‌మంలో రూపాయి మారకపు విలువ బలపడటం కూడా ప‌సిడి ధరల తగ్గుదలకు కార‌ణ‌మ‌ని చెబ‌తున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో బుధ‌వారం బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించిగా.. ప్ర‌స్తుత ధ‌ర రూ.58,300
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించ‌గా..ప్ర‌స్తుత ధ‌ర‌ రూ.53,140

 

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Related Tags