జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరులో దూకుడు మీదున్న బీజేపీ.. నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాజ్ వివంతాలో జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోని ఆ పార్టీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేయనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోరు.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 11:55 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోరులో దూకుడు మీదున్న బీజేపీ.. నేడు మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాజ్ వివంతాలో జీహెచ్ఎంసీకి సంబంధించి బీజేపీ మేనిఫెస్టోని ఆ పార్టీ జాతీయ నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేయనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోని విడుదల చేయనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరం అభివృద్ధే లక్ష్యంగా తమ మేనిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్‌ సహా పార్టీ రాష్ట్ర నాయకత్వం పాల్గొననున్నట్లు సమాచారం.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే వర్షాల కారణంగా నష్ట పోయిన వారందరినీ ఆదుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరద బాధితులకు రూ.25 ఆర్థిక సాయంతో పాటు ఇల్లు పొతే ఇల్లు, కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, నగరం పరిధిలో వాహనాలపై ఉన్న చలాన్లను జీహెచ్ఎంసీ చేతనే కట్టిస్తామని కూడా బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ హామీల నేపథ్యంలో బీజేపీ విడుదల చేయనున్న మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలను తమవైపు లాగేందుకు ఇంకెలాంటి హామీలు ఇస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇదిలాఉండగా, ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కూడా. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే.. టీఆర్ఎస్ పార్టీ యధావిధిగా విడుదల చేసిందని కిషన్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ హామీలు అమలుకు నోచుకోనివి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.