రికార్డ్ లెవ‌ల్ లో భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌..వెండి మాత్రం..

లాక్ డౌన్ లోనూ బంగారం ధర పైకి ప‌రుగులు పెడుతోంది. మంగ‌ళ‌వారం కూడా కూడా గోల్డ్ ధర భారీగా పెరిగింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గినా కూడా ఇండియాలో ప‌సిడి ధర పైకి మొగ్గ‌డం గమనార్హం. బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఐదో రోజు. అయితే వెండి ధరలో మాత్రం త‌గ్గుద‌ల క‌నిపించింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర అమాంతం పెరిగింది. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.970 […]

రికార్డ్ లెవ‌ల్ లో భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌..వెండి మాత్రం..
Follow us

|

Updated on: Apr 28, 2020 | 8:42 AM

లాక్ డౌన్ లోనూ బంగారం ధర పైకి ప‌రుగులు పెడుతోంది. మంగ‌ళ‌వారం కూడా కూడా గోల్డ్ ధర భారీగా పెరిగింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గినా కూడా ఇండియాలో ప‌సిడి ధర పైకి మొగ్గ‌డం గమనార్హం. బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఐదో రోజు. అయితే వెండి ధరలో మాత్రం త‌గ్గుద‌ల క‌నిపించింది.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర అమాంతం పెరిగింది. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.970 పెరుగుదలతో రూ.46,900కు చేరింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా ఏకంగా రూ.2120 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.44,740కు ఎగసింది.

బంగారం ధర పెరిగితే..అందుకు భిన్నంగా వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.400 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.42,200కు ప‌డిపోయింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్లు నుంచి డిమాండ్ త‌గ్గిపోవ‌డం ఇందుకు మెయిన్ రీజ‌న్ గా చెప్పుకోవచ్చు.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర ఏకంగా రూ.2030 పెరుగుదలతో రూ.45,150కు ఎగ‌సింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర కూడా రూ.1620 పెరుగుదలతో రూ.47,650కు చేరింది. ఇక కేజీ వెండి ధర మాత్రం రూ.400 తగ్గింది. దీంతో ధర రూ.42,200కు ప‌డిపోయింది. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?