ఈసారి మోదీ గుడ్ న్యూస్..కేవలం పురుష ఉద్యోగులకే

పురుష పుంగవులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ఏ క్షణమైన కేంద్ర ప్రభుత్వం ద్వారా వినిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అంటారా? ఉద్యోగం చేసే మహిళలు గర్భవతులైతే వారికి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత మొత్తం 12 నెలల దాకా వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల మహిళలకు చాలా వెసులుబాటు లభించింది. […]

ఈసారి మోదీ గుడ్ న్యూస్..కేవలం పురుష ఉద్యోగులకే
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 2:30 PM

పురుష పుంగవులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో గుడ్ న్యూస్ వినిపించబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ఏ క్షణమైన కేంద్ర ప్రభుత్వం ద్వారా వినిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అంటారా?

ఉద్యోగం చేసే మహిళలు గర్భవతులైతే వారికి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత మొత్తం 12 నెలల దాకా వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల మహిళలకు చాలా వెసులుబాటు లభించింది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. ప్రైవేటు రంగంలోని మహిళా ఉద్యోగులకు కూడా వర్తింపచేయడంతో మహిళలల్లో ఆనందం వ్యక్తమైంది.

అయితే, ఈ మెటర్నిటీ లీవ్ వల్ల మహిళలు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నా.. మగవారికి మాత్రం లోటు అలాగే వుండిపోయింది. ప్రసవానికి ముందు తమ భార్యలను దగ్గరుండి చూసుకోవడానికి, ప్రసవం తర్వాత తల్లీబిడ్డల సంక్షేమ బాధ్యతలను మోయడానికి పురుష ఉద్యోగులకు అవకాశం తక్కువ. సెలవు పెట్టినా మాగ్జిమమ్ ఓ వారం రోజులు. ఆ తర్వాత భార్యాపిల్లలను వదిలేసి ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి పురుష ఉద్యోగులది.

ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఇదేమంత పెద్ద సమస్య కాదు. కానీ, మైక్రో ఫ్యామిలీస్ పెరిగిపోతున్న తరుణంలో చంటిపిల్లలను, బాలింత భార్యను ఇంటి వద్ద వదిలి ఉద్యోగానికి వెళ్ళే భర్తలది ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితిలో సైతం మధ్యలో ఇంటికి రాలేని పరిస్థితి. సరిగ్గా ఇలాంటి వారి కోసమే నరేంద్ర మోదీ త్వరలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

ప్రసవ సమయంలో భార్యను, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను దగ్గరుండి చూసుకునేందుకు పురుష ఉద్యోగులకు పెటర్నిటీ లీవులిచ్చేలా లేబర్ యాక్టులో మార్పులు తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి ప్రధాన మంత్రి స్వయంగా త్వరలో ప్రకటన చేస్తారని చెప్పుకుంటున్నారు. సో.. నిజంగానే ఇది పురుష ఉద్యోగులకు శుభవార్తే కదా?

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..