Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

మీకు ఎస్‌బీఐ అక్కౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

To Know About SBI's Minimum Balance Rules, మీకు ఎస్‌బీఐ అక్కౌంట్ ఉందా? ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇకపై తమ బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన కనీస నిల్వలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ ఎమౌంట్ మొత్తాన్ని తగ్గించింది.
ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ని ఖాతాల్లో కనీసం రూ.3 వేలు ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అదే విధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం రూ.2 వేలు ఉంచాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులు కనీసం ఒక వెయ్యి రూపాయలు ఉంచుకోవాలని బ్యాంకు ప్రకటించింది.

నిబంధంనలు పాటించని ఖాతాదారులపై ఛార్జీల మోత మోగనుంది. పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్  రూ.1500 వరకు మాత్రమే ఉంటే అటువంటి ఖాతాలపై రూ.10, రూ.750 వరకు ఉంటే రూ.12.75, అంతకు తగ్గిపోతే రూ.15 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి జీఎస్టీ అధనంగా చెల్లించాలి.

అయితే సేవింగ్స్ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్ చేయాలనుకుంటే ఇకపై నెలకు మూడుసార్లు మాత్రమే డిపాజిట్ చేసేలా రూల్స్ మార్చారు. అది దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. మూడుసార్లు లిమిట్ దాటిన తర్వాత నాలుగోసారి డిపాజిట్ చేసినా.. కనీసం రూ.100 రూపాయలు డిపాజిట్ చేసినా రూ.50 ఛార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో పాటు జీఎస్టీ కూడా అదనంగా కట్టాల్సిందేనంటూ బ్యాంక్ ప్రకటించింది. అదే విధంగా హోం బ్రాంచి నుంచి కాకుండా వేరే బ్రాంచి నుంచి డిపాజిట్ చేయదల్చుకుంటే గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. అదే విధంగా తమ ఎక్కౌంట్‌లో కనీసం రూ.25 వేలు బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించారు. అదే విధంగా రూ.25 వేల నుంచి 50 వేల మధ్య బ్యాలెన్స్ ఉంచే ఖాతాదారులు నెలకు 10 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. మినిమమ్ నెలకు రూ.1 లక్ష బ్యాలెన్స్ ఉంచే కస్టమర్లు ఎన్నిసార్లయినా విత్‌డ్రా చేసుకోవచ్చంటూ బ్యాంకు అధికారులు ప్రకటించారు.

అయితే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు నగదును ఉపసంహరించుకోవచ్చు. నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయితే జీఎస్టీతో కలిపి రూ.168 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నితో పాటు ఇతర బ్యాంకు కస్టమర్లు ఎస్‌బీఐ ఏటీఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చు.

అయితే ఎస్‌బీఐ ఖాతాదారుల మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించి విడుదల చేసిన కొత్త రూల్స్‌పై  మధ్యతరగతి కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చి ఖాతాదారుల వద్దనుండి బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయంటూ పెదవి విరుస్తున్నారు.

Related Tags