పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం దాగి ఉంది: కేటీఆర్

గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు

పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం దాగి ఉంది: కేటీఆర్
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:46 PM

గ్రామాల్లో, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య పరిరక్షణ ఉందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలైంది. పట్టణాల మార్పే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్. సీఎం కేసీఆర్ పిలుపుతో పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో సహా ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే తమ గ్రామాల్లో, పట్టణాల్లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మున్సిపల్ ఉద్యోగితో పాుట వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్. పట్టణ ప్రగతి కార్యక్రమం తీరుపై అయా జిల్లాల వారిగా అడిషనల్ కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. పట్టణాలను అదర్శ పట్టణాలుగా మార్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా నూతన మున్సిపల్ చట్టంపైన ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధ్యమవుతుందన్నారు మంత్రి కేటీఆర్.