నియంత్రిత పంట సాగు కాదు..ఇవాళ్టి నుంచి..

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్‌పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. గ్రామంలోవానకాలం -2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ...

నియంత్రిత పంట సాగు కాదు..ఇవాళ్టి నుంచి..
Follow us

|

Updated on: May 26, 2020 | 5:24 PM

నియంత్రిత పంట సాగు కాదు.. ఇవాళ్టి నుంచి ప్రాధాన్య పంట సాగు అందామని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్‌పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. గ్రామంలోవానకాలం -2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంత్రి, జెడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎప్డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డితో కలిసి హాజరయ్యారు. దాతర్‌పల్లిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రైతే రాజు కావాలన్నది నినాదం. కానీ అది విధానంగా మారాలన్నారు.

దాతర్‌ పల్లి అంటే.. ఆదర్శమని, పోయిన యేడాది సన్నరకం వరి పండించి సేంద్రియ ఎవుసం చేశామని చెప్పారు. ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు బస్తా బియ్యం ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. పేలిపోయే ట్రాన్స్‌ ఫార్మర్లు, కాలిపోయే వెూటార్లతో ఒకప్పు డు రైతులు బతుకులు వెళ్లదీసే వారని వాపోయారు. ఆనాడు రెండు ఎకరాల పంట పెడితే..అర ఎకరం పొలం అయిన ఎండిపోయేది అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట ఎండలేదని, ఒక గంట కరెంటు పోలేదన్నారు. నాడు ఎరువులు కావాలంటే.. క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. ఆఖరుకు చెప్పులు కూడా క్యూలైన్ ‌లో పెట్టాల్సిన దుస్థితి ఉండేదన్నారు… కానీ ఇవాళ మీ ఊర్లకే మందు యూరియా బస్తాలు పంపుతున్నామని మంత్రి పేర్కొన్నారు. పంట పండించటం కోసం షావుకారు దగ్గర అప్పు తెచ్చుకునేటోళ్లం..కానీ, నేడు ఆ ఇబ్బంది లేదు.. రైతుబంధు ద్వారా ప్రభుత్వం సాగుకు కావాల్సిన నిధులు సమకూరుస్తుందని చెప్పారు. పండించిన పంటకు కూడా మద్ధతు ధర ఇస్తున్నామని అన్నారు.

ప్రాధాన్యత పంటసాగులో రాష్టానికే  గజ్వేల్‌ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందన్నారు. నియోజక వర్గంలోని 8 మండలాల్లో 5 మండలాలు ఇందుకు ఏకగ్రీవంగా ఆవెూదం తెలిపాయని, వాటిలో 173 గ్రామాలకు 167 గ్రామాలు ప్రాధాన్యత పంట సాగుకు ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఎవుసంలో దాతర్‌ పల్లిని ఆదర్శంగా చేద్దామని, ఈ వానా కాలం గ్రామంలో 656 ఎకరాల్లో.. 27 ఎకరాలు సన్నరకం, 28 ఎకరాలు దొడ్డు రకం వరి పంట, యాసంగిలోనే మొక్కజొన్న పంట, గతంలో 365 ఎకరాల్లో వేసిన పత్తికి, ఈ వానా కాలంలో 381 ఎకరాల్లో పత్తి పంట వేయాలని నిర్ణయించి తీర్మానించిన గ్రామస్తులను మంత్రి అభినందించారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..