దుర్గాపూజా ఉత్సవాల్లో ఎంపీ నుస్రత్ జహాన్ డ్యాన్స్ ..వాహ్ !

కోల్ కతా నగరంలో దుర్గాపూజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ పూజల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కాదు, ఇతర మహిళలతో కలిసి  స్టెప్పులు వేయడమే గాక.., ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ముఖాలకు మాస్కులు ధరించి అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించారు.  హిందువును పెళ్ళాడి, చీరకట్టు, నుదుట సింధూరంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నుస్రత్  జహాన్ పట్ల  గత ఏడాది సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆమె […]

  • Umakanth Rao
  • Publish Date - 4:09 pm, Sat, 24 October 20

కోల్ కతా నగరంలో దుర్గాపూజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమిని పురస్కరించుకుని టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ ఈ పూజల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కాదు, ఇతర మహిళలతో కలిసి  స్టెప్పులు వేయడమే గాక.., ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ముఖాలకు మాస్కులు ధరించి అంతా కోవిడ్ ప్రొటొకాల్స్ పాటించారు.  హిందువును పెళ్ళాడి, చీరకట్టు, నుదుట సింధూరంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్న నుస్రత్  జహాన్ పట్ల  గత ఏడాది సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆమె వాటిని ఖాతరు చేయలేదు. అన్ని పండుగలను తాను జరుపుకొంటానని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని ఆమె ఆనాడే పేర్కొంది. కాగా-దేశంలో కరోనా వైరస్ కేసులు 78 లక్షలకు చేరుకున్నాయి.