కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా పలు చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలువురిని ముందస్తు అరెస్ట్‌లు చేశారు పోలీసులు. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన […]

కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Oct 19, 2019 | 10:22 AM

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా పలు చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పలువురిని ముందస్తు అరెస్ట్‌లు చేశారు పోలీసులు. మరోవైపు బంద్‌ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.