తిరుపతి ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ సర్వీసులేవి..?

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రమానికి ఐదేళ్లైనా ఒక అంతర్జాతీయ సర్వీసు నడపని కేంద్రం.. రన్ వే విస్తరణ పనులతో హడావిడి చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం అనాధాశ్రమంగా మారిందన్నారాయన. కేంద్ర బడ్జెట్ లో నిధులే కేటాయించకుండా 177 కోట్ల రూపాయలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రన్ వే విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గన్నవరం, విశాఖ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నా.. తిరుపతిపై ఎందుకంత చిన్న చూపు […]

తిరుపతి ఎయిర్ పోర్ట్ కు అంతర్జాతీయ సర్వీసులేవి..?
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2019 | 7:48 AM

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రమానికి ఐదేళ్లైనా ఒక అంతర్జాతీయ సర్వీసు నడపని కేంద్రం.. రన్ వే విస్తరణ పనులతో హడావిడి చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం అనాధాశ్రమంగా మారిందన్నారాయన. కేంద్ర బడ్జెట్ లో నిధులే కేటాయించకుండా 177 కోట్ల రూపాయలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రన్ వే విస్తరణ పనులకు శంఖుస్థాపన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గన్నవరం, విశాఖ ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నా.. తిరుపతిపై ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు చింతా మోహన్.