భారీగా త‌గ్గిన‌ శ్రీవారి హుండీ ఆదాయం..లెక్క‌లు చూస్తే షాక్ తినాల్సిందే

కరోనా ప్రభావం తిరుమ‌ల దేవ‌స్థానంపై భారీగా ప‌డింది. వెంక‌న్న ఆదాయానికి తీవ్రస్థాయిలో గండి ప‌డింది.

భారీగా త‌గ్గిన‌ శ్రీవారి హుండీ ఆదాయం..లెక్క‌లు చూస్తే షాక్ తినాల్సిందే
జులై మాసంలో 7.13 లక్షల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Follow us

|

Updated on: Jul 28, 2020 | 11:59 AM

Tirumala News : కరోనా ప్రభావం తిరుమ‌ల దేవ‌స్థానంపై భారీగా ప‌డింది. వెంక‌న్న ఆదాయానికి తీవ్రస్థాయిలో గండి ప‌డింది. వైర‌స్ వ్యాప్తి కారణంగా ఈ సంవత్సరం మార్చి 20 నుంచి జూన్‌ 8 వరకు టీటీడీ శ్రీవారి భక్తుల దర్శనాలను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ స‌డ‌లింపులు వ‌చ్చిన అనంత‌రం ప్రయోగాత్మకంగా రోజుకు మూడు వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో ద‌ర్శ‌నాలు ప్రారంభించింది. క్రమక్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ 9వేల వరకు తెచ్చింది. ప్రజంట్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. అయితే ఇటీవ‌ల టీటీడీ సిబ్బంది, అర్చ‌కులు భారీ స్థాయిలో వ్యాధి బారిన ప‌డ‌టంతో…టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల్లో సగం మందే శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో స్వామివారి ఆదాయానికి గండి ప‌డింది.

సాధారణ రోజుల్లో రోజుకు యావ‌రేజ్ గా రూ.3 కోట్లు హుండీ ఆదాయం వచ్చేది. ప్రజంట్ రూ.50 నుంచి రూ.60 లక్షలు మాత్ర‌మే వస్తోంది. గతంలో ప్ర‌తిరోజూ దాదాపు 3లక్షల లడ్డూలు విక్రయమయ్యేవి. ఇప్పుడు 30 వేల ల‌డ్డూలు కూడా అమ్ముడ‌వ్వ‌డం లేదు. తలనీలాల ఇచ్చేందుకు కూడా భ‌క్తులు జంకుతున్నారు. టీటీడీకి సంబంధించి దాదాపు 12వేల కోట్లకు పైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, టన్నుల కొద్దీ ఉన్న బంగారం నుంచి వచ్చే వడ్డీ ఆదాయంతో ప్రస్తుతం ఉద్యోగులు, అర్చ‌కులు వేతనాలు ఇస్తూ మెయింటైన్ చేస్తోంది టీటీడీ.

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు

Read More : ప్ర‌ముఖ న‌టుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్..