కరోనా కట్టడికి టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గోవిందా అంటేనే కోర్కెలు తీర్చే భగవంతుడి సన్నిధి అది.. నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలు తయారు చేసే

కరోనా కట్టడికి టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 1:05 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గోవిందా అంటేనే కోర్కెలు తీర్చే భగవంతుడి సన్నిధి అది.. నిత్యం లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలు తయారు చేసే ప్రాంతం అది.. ఆకలి అంటే కడుపు నిండా అన్నం పెట్టే సత్రం అది.. లడ్డూలు, అన్న ప్రసాదాలు మాత్రమే కాదు.. భక్తుల ఆరోగ్యం కోసం ఆయుద్వేద మందులు కూడా తయారు చేయగలం అంటోది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). కరోనా వైరస్‌ కట్టడి కోసం టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ చేపట్టింది. కరోనా నివారణకు ఉపయోగపడే రక్షజ్ఞధూపం, పవిత్ర, గండూషము, నింబనస్యం, అమత మాత్రలను విడతల వారీగా పంపిణీ చేయనున్నట్ల టీటీడీ వెల్లడించింది.

తిరుమలలో భక్తుల దర్శనాన్ని నిలిపివేసినం సంగతి విదితమే. తిరుమల చరిత్రలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం 1892 తరువాత ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనాకు మందు కనిపెట్టే దిశగా ప్రయోగాలు చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆయుర్వేద ఫార్మసీ, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దవాఖాన,  సంయుక్తంగా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నాయి.