డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో శ్రీవారి ఆలయం పాక్షికంగా మూతపడనుంది. సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం తలుపులు క్లోజ్ చేయనున్నారు.  డిసెంబరు 26 తేదీ.. గురువారం మార్నింగ్ 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని వేద పండితులు తెలిపారు. ఈ కారణంతో.. ఆలయ చారిత్రక నేపథ్యం ప్రకారం 6 గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి […]

డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత
Follow us

|

Updated on: Nov 25, 2019 | 9:17 AM

డిసెంబర్‌ 25, 26 తేదీల్లో శ్రీవారి ఆలయం పాక్షికంగా మూతపడనుంది. సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం తలుపులు క్లోజ్ చేయనున్నారు.  డిసెంబరు 26 తేదీ.. గురువారం మార్నింగ్ 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని వేద పండితులు తెలిపారు. ఈ కారణంతో.. ఆలయ చారిత్రక నేపథ్యం ప్రకారం 6 గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు గుడి తలుపులు మూసి.. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత  మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.

ఇక ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 42 లక్షల రూపాయలు. ఈ తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన పూర్తయ్యాయి. ఉదయం ఏడున్నర నుంచి నుంచి రాత్రి 7 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు సర్వదర్శనానికి అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్‌ సేవ ఉంటాయి. సాయంత్రం ఐదున్నరకు సహస్ర దీపాలంకరణ ఉంటుంది.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!