Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

జగన్ ఆర్డర్..టీటీడీలోకి రమణదీక్షితులు రీ ఎంట్రీ..

Cm ys jagan decided to give key post to ttd ex priest ramana dixitulu, జగన్ ఆర్డర్..టీటీడీలోకి రమణదీక్షితులు రీ ఎంట్రీ..

సీఎం జగన్ మార్క్ నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో..ఇబ్బందులు పడ్డ వాళ్లకి జగన్ పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. గతంలో టీటీడీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో రమణదీక్షితలను… పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి..  ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడం ద్వారా తీసివేశారు. అప్పట్లో ఆయన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ను కలిసి తన బాధను వెల్లిబుచ్చుకున్నారు.  తాజాగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆగమ సలహాదారుడిగా రమణ దీక్షితులు నియమితులయ్యారు. శ్రీవారి కైంకర్యాలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.  సీఎం జగన్‌ ఆదేశాలతో  తిరిగి ఆయన్ను టీటీడీ విధుల్లోకి తీసుకుంది. అలాగే ఆయన కుమారులు వెంకట కుమార దీక్షితులు, రాజేష్ దీక్షితులను గోవిందరాజ స్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ చేశారు. రమణ దీక్షితులతో పాటు ఉద్యోగ విరమణ చేసిన నలుగురికి కూడా శ్రీవారి ఆలయంలో పున:ప్రవేశం కల్పించింది.

గతంలో రమణదీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా చాలాకాలం విధులు నిర్వర్తించారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయన శ్రీవారి ఆలయ విధులకు దూరమయ్యారు. టీటీడీ తాజా నిర్ణయంతో ఓ వైపు ఆగమ సలహాదారుడిగా ఉంటూనే యువ అర్చకులకు శిక్షణ ఇచ్చే అదనపు బాధ్యతలను రమణదీక్షితులు నిర్వర్తించనున్నారు. గతనెల 23న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం మేరకు ఆగమ సలహాదారుగా నియమిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.