Breaking News
  • హైదరాబాద్‌: పాతబస్తీ ప్రజలు వరదల్లో బాగా నష్టపోయారు. వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేస్తాం . 117 ఏళ్ల తర్వాత 29 సెం.మీ వర్ష పాతం నమోదైంది . 117 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో 15వేల మంది చనిపోయారు . భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . సాలరే మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నుంచి 33 వస్తువులను వరద బాధితులను ఇస్తున్నాం. ఇలాంటి సమయంలో విమర్శలు తగదు, అందరూ కలిసి సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం అందించే రూ.10వేలు సాయం అభినందనీయం . ప్రభుత్వం వరద బాధితులకు మరింత సాయం అందించాలి . పార్టీ ఆదేశిస్తే బీహార్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తా-అక్బరుద్దీన్‌ ఓవైసీ.
  • కూల్చివేతలు, కుట్రలు, అక్రమ అరెస్ట్‌లే లక్ష్యంగా జగన్‌ పాలన. విద్య కోసం కూడా ఇతరరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమైతే నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలి. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. తిరుగుబాటు తప్పదు. -టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
  • నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొడాలి నాని. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొన్ని నెలలు మాత్రమే ఉంటారు. తర్వాత రిటైరై హైదరాబాద్‌లో ఉంటారు-మంత్రి కొడాలి నాని. ప్రభుత్వానికి రమేష్‌కుమార్‌ కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా నిమ్మగడ్డ ఏమీ చేయలేరు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో.. ప్రస్తుతం ప్రభుత్వానికి లేదు-మంత్రి కొడాలి నాని. బీహార్‌ ఎన్నికలతో స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చకూడదు-కొడాలి నాని.
  • మహబూబాబాద్‌: దీక్షిత్ కిడ్నాప్‌, హత్య కేసులో తల్లి వసంత అనుమానాలు. దీక్షిత్‌ కేసులో మంద సాగర్‌తో పాటు మరో ముగ్గురి పాత్ర కూడా ఉంది. వారి నుంచి మాకు, మా చిన్న కుమారుడికి కూడా ప్రాణ హాని ఉంది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి.. లేదా కేసు సీబీఐకి అప్పగించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే మరిన్ని నేరాలు పెరుగుతాయి. -దీక్షిత్‌ తల్లి వసంత.
  • అమరావతి: కృష్ణా బోర్డు పరిధిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు. స్పిల్‌వేలు, జలవిద్యుత్ కేంద్రాలు బోర్డు ఆధీనంలోకి తేవాలి. కాలువహెడ్ రెగ్యులేటర్లు, ఎత్తిపోతలపథకాలను బోర్డు పరిధిలోకి తేవాలి. నీటి విడుదల, నియంత్రణ అధికారులు.. బోర్డు పర్యవేక్షణలోనే విధులు నిర్వహించాలని ప్రతిపాదనలు.
  • ట్రాఫిక్‌ జరిమానాల పెంపుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని నిర్ణయించాం. అడ్డగోలుగా వాహనాలు నడిపేవారిపై చర్యలు తప్పవు-మంత్రి పేర్ని నాని. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉండాలి-మంత్రి పేర్ని నాని. ఏపీ, తెలంగాణ చెక్‌పోస్టుల దగ్గర ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించాం-పేర్ని నాని. మంగళవారం ఒప్పందం చేసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెప్పారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. టీఎస్ అధికారులు ఏది చెబితే దానికి ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకా టీఎస్‌ అధికారులు ప్రతిపాదనలు ఇవ్వలేదు-పేర్ని నాని. మేము మొదటి నుంచి కూడా మొండిగా ప్రవర్తించలేదు. ఆర్టీసీ లాభనష్టాలను చూడడంలేదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ ఆర్టీసీకి సెలవుల కారణంగా ఒప్పందం చేసుకోలేకపోయాం.
  • గుంటూరు: తాడేపల్లిలోని రెండు ఫార్మసీ షాపుల్లో చోరీ, రూ.18 వేలు, సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిన దుండగులు, పీఎస్‌లో ఫిర్యాదు.

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

navaratri brahmotsavam, తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్‌ ప్రభావంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోనే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ విశ్వక్సేనుల వారిని రంగనాయకుల మండలంలోకి వేంచేపు చేసి.. ఆస్థానం చేపట్టారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం అత్యంత కీలకమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్ధించేందుకు అంకురార్పణం చేస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులోభాగంగా బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం జరిపారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై ఊరేగుతారు. ఆదిశేషుడు తన శిరస్సుపై సమస్త భూభారాన్ని మోస్తుంటారు. ఆదిశేషుడు శ్రీవారికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

ఇప్పటికే బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి.. ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. స్వామివారితో సమానంగా మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. 15 కోట్ల సంవత్సరాల ముందు శ్రవణ నక్షత్రం కన్యామాసంలో శ్రీవారు తిరుమల కొండపై ఆవిర్భవిచారని పురాణ ప్రాశస్త్యం. అప్పుడే శ్రీవారి వక్షస్థలంపై వ్యూహలక్ష్మి అమ్మవారు, పద్మావతి అమ్మవారు కూడా కొలువయ్యారు. మూలమూర్తి వక్షస్థలంలో చతుర్భుజాకారంలో చిన్న పరిణామంలో వ్యూహలక్ష్మి ఉంటారు. ప్రతీ శుక్రవారం మూలమూర్తికి అభిషేకం చేస్తారు.

అక్టోబ‌రు 24న ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని అద్దాల మండపంలో స్నప‌న‌తిరుమంజ‌నం, చ‌క్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల మ‌రుస‌టి రోజు అక్టోబ‌రు 25న ఏకాంతంగా విజ‌య‌ద‌శ‌మి పార్వేట ఉత్సవం జరుపుతారు. అదేరోజు మధ్యాహ్నం శ్రీ‌వారి ఆల‌యంలోని కల్యాణ మండపానికి శ్రీ మ‌ల‌య‌ప్పస్వామివారిని వేంచేపు చేస్తారు. అక్కడ పార్వేట ఉత్సవం తర్వాత స్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి వేంచేపు చేస్తారు.

Related Tags