ఇకపై మరింత టేస్టీగా శ్రీవారి లడ్డూ..!

తిరుమలకు వెళ్లి  వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ అనూభూతి వర్ణించలేదని. మనసు చెప్పలేని తన్మయత్వంతో పులకరిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. అటువంటి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లడం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. శ్రీవారి  ప్రసాదాలలో కెల్లా లడ్డూ ప్రధానమైనది కూడా. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే దీని […]

ఇకపై మరింత టేస్టీగా శ్రీవారి లడ్డూ..!
Follow us

| Edited By:

Updated on: Nov 08, 2019 | 9:34 AM

తిరుమలకు వెళ్లి  వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఆ అనూభూతి వర్ణించలేదని. మనసు చెప్పలేని తన్మయత్వంతో పులకరిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లడ్డూ. అటువంటి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లడం కోసం శ్రీవారి భక్తులు ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. శ్రీవారి  ప్రసాదాలలో కెల్లా లడ్డూ ప్రధానమైనది కూడా. అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముక్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకుండా.. భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు (Geographical Patent) లభించింది. కాగా తిరుపతి ఆలయంలో రోజుకు సగటున 4 లక్షల లడ్డులను తయారీ చేస్తారు.

ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలుకలు, పటిక బెల్లం, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. అయితే కొన్నిసార్లు జీడిపప్పుకు కొరత వస్తూ ఉండగా.. ఇకపై కొరత ఉండబోదు. ఎందుకంటే జీడిపప్పు ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్న కేరళ… ఇకపై తిరుపతి లడ్డు తయారీకి తాజా జీడిపప్పులను పంపించనుంది. ప్రతి నెల 300 టన్నుల జీడిపప్పు తిరుపతి ఆలయానికి అందించాలని కేరళతో తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల 70 కోట్ల ఆదాయం లభిస్తుందని కొల్లంలోని జీడిపప్పు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్​ ఎస్​. జయమోహన్​ తెలిపారు.