Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

ముక్కోటి ఏకాదశికి.. 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం!

TTD plans to keep Vaikunta Dwaram open for 10 days, ముక్కోటి ఏకాదశికి.. 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం!

తిరుమ‌ల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాద‌శి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబ‌వుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాద‌శి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలుపనున్నారు.

వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటివరకు కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే వీలుంది. అయితే భక్తులు అపరిమిత సంఖ్యలో రావడం వల్ల, చాలా మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం లభించడంలేదు. ఈ క్రమంలో ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు స్వామివారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలను టీటీడీ సిద్దం చేస్తోంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వ‌చ్చే యాత్రికుల కోసం అధికారులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పది రోజుల దర్శనానికి తిరుమల దేవస్థానం ఆగమ సలహామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. పాలకమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

Related Tags