Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

మనకెందుకు మతం ముద్ర..అందుకే ఈ తీర్థయాత్ర

ycp leaders tirumala padyatra, మనకెందుకు మతం ముద్ర..అందుకే ఈ తీర్థయాత్ర

ఎంత లౌకిక దేశం అని మనం చెప్పుకున్నా దేశంలో రాజకీయాలు మతం, కులం ఆధారంగానే జరుగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఏపీ రాజకీయాల్లో మతం, కులం అనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీల మధ్య హిందుత్వం ఆధారంగా మాటల తూటాలు పేరాయి. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం అండ వుందన్న కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.

ఈ నేపథ్యంలో మతం ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగా కడప జిల్లా నేతలు తిరుమల మహా పాదయాత్ర పేరిట ఓ యాత్ర ప్రారంభించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి ఈ మహా పాదయాత్రను చేపట్టారు. కాగా.. ఈ యాత్రకు వైసీపీ నేతలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో శనివారం క్లియర్‌గా వెల్లడైంది.

శనివారం పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేటవద్ద ఆకేపాటి అమర్నాథరెడ్డి తిరుమల మహా పాదయాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల యాత్రలో పాల్గొనడం ఆనందంగా వుందని అంజాద్ బాషా అన్నారు.

500 సంవత్సరాల క్రితం అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటను త్వరలో భక్తులకు సులువైన మార్గంగా మారుస్తామని బాషా ప్రకటించారు. అన్నమయ్య కాలిబాటను సులువైన మార్గంగా మార్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు.