Tirumala Income: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న శ్రీవారి హుండీ
Tirumala Income: సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.10 కోట్లు వచ్చిందని, శ్రీవారిని 34,768 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.13,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీటీడీ ఆధ్వర్యంలో కామధేను పూజ ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. శుక్రవారం నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ పునఃప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపంలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన.. ‘అమ్మఒడి’ డబ్బుల కోసం ఆళినే కడతేర్చాడు.. కారణాలు ఇలా ఉన్నాయి..