మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు

నిత్య కళ్యాణ శోభితుడు…నిఖిల లోకేశుడైన శ్రీ వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో అయిదో రోజు బుధవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

  • Balu
  • Publish Date - 11:18 am, Wed, 23 September 20

నిత్య కళ్యాణ శోభితుడు…నిఖిల లోకేశుడైన శ్రీ వేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో అయిదో రోజు బుధవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత వుంది.. మిగిలిన అన్ని వాహన సేవలు స్వామి వారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే.. మోహినీ అవతారం ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది.. మోహినీ అవతారంలో వున్న స్వామి వజ్రవైఢూర్యాలు పొదిగిన హారాన్ని ధరించి..కుడి చేతిలో చిలుకను పట్టుకుని వుంటారు.. ఈ హారాన్నీ…చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవల్లి పుత్తూరు అండాళ్‌ నుంచి తెచ్చారు… ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాత్రి ఏడు గంటల నుంచి 8.30 వరకు గరుడసేవ జరగనుంది. గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సీఎం జగన్‌ సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.