తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల బ్రహోత్సవాలు అంకురార్పణ జరిగింది.. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈసారి భక్త జన సందోహం లేకుండా జరుగుతున్నాయి.. ఇదో కొత్త అనుభవం.. వేంకటేశ్వరుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు కనులారా తిలకించి…భక్తి పారవశ్యంతో పునీతులయ్యే అవకాశం ఈసారి భక్తులకు లేకపోయినా .. ఆ తిరుమలేశుడి కరుణా కటాక్ష వీక్షణాలు మాత్రం సదా ప్రసరిస్తూనే ఉంటాయి.. కొండలంత వరాలను గుప్పించే ఆ దేవదేవుడు భక్తులకు వరాలను ప్రసాదిస్తూనే ఉంటాడు.. బ్రహ్మ కడిగిన పాదమది…బ్రహ్మము తానైన పాదమది…ఆ పాదమే […]

తిరుమల వేంకటేశ్వరుడి  బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Follow us

|

Updated on: Sep 19, 2020 | 12:32 PM

తిరుమల బ్రహోత్సవాలు అంకురార్పణ జరిగింది.. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ఈసారి భక్త జన సందోహం లేకుండా జరుగుతున్నాయి.. ఇదో కొత్త అనుభవం.. వేంకటేశ్వరుడికి జరిగే బ్రహ్మోత్సవాలకు కనులారా తిలకించి…భక్తి పారవశ్యంతో పునీతులయ్యే అవకాశం ఈసారి భక్తులకు లేకపోయినా .. ఆ తిరుమలేశుడి కరుణా కటాక్ష వీక్షణాలు మాత్రం సదా ప్రసరిస్తూనే ఉంటాయి.. కొండలంత వరాలను గుప్పించే ఆ దేవదేవుడు భక్తులకు వరాలను ప్రసాదిస్తూనే ఉంటాడు.. బ్రహ్మ కడిగిన పాదమది…బ్రహ్మము తానైన పాదమది…ఆ పాదమే కాదు..ఆపాదమస్తకమూ అద్భుతమే…ఆ జగదేకమోహనుడి దివ్య స్వరూపాన్ని చూసేందుకు వేయికళ్లయినా చాలవు…ఆ మంగళమూర్తిని ఎంత సేపు చూసినా తనివి తీరదు…జగదానందకారకుడైన వేంకటేశుడు నయనానందకరంగా వుంటాడు కాబట్టే అనునిత్యమూ తిరుమల భక్తులతో పోటెత్తుతుంటుంది… తిరుమల ఆలయంలో నిత్యకళ్యాణము..పచ్చతోరణమే…ఎప్పుడూ పండుగ వాతావరణమే…బ్రహ్మోత్సవాల వేళ మరింత తాకిడి ఉంటుంది.. కానీ ఈ తడవ అలా లేదు.. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.. ఎలా జరిగిన బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలే కాబట్టి వాటి వైశిష్టతలను తెలుసుకుందాం! శేషాచలంలో వెలిసిన ఆది దేవుడికి మొదటిసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే బ్రహ్మోత్సవాలను జరిపించినట్టు భవిష్యోత్తర పురాణం చెబుతోంది…బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కాబట్టే ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి…మరో పురాణ కథనం ప్రకారం… నవాహ్నిక దీక్షతో ..నవ బ్రహ్మలు తొమ్మది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయట.

అసలు ఈ ఉత్సవాలకు…బ్రహ్మదేవుడికి ఎలాంటి సంబంధం లేదనీ.. మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మండంగా జరుగుతాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో కథనం..ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మాత్రం సత్యం… దివ్య మందహాసుడి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి…స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఇవాళ మొదలయ్యాయి..బ్రహ్మోత్సవాల ఆరంభరోజుకి ముందు రోజు కానీ.. మూడు రోజులు….అయిదు రోజులు…ఏడు రోజులు… లేదా తొమ్మది రోజుల ముందుకానీ అంకురార్పణ జరుగుతుంది…ఇలా నిర్ధారితమైన రోజున..బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించడానికి స్వామివారి సేనాధిపతి విష్వక్సేనుడు ఆలయంలో నైరుతి దిశలో వున్న వసంతమండపానికి వస్తాడు.. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని రాసి.. ఆ ఆకారంలో లలాట..బాహు..స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసి …స్వామివారి ఆలయంలోకి వస్తాడు. దీన్నే మృత్‌ సంగ్రహణం అంటారు.. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి..వ్రహి..యవ..ముద్గ…మాష..ప్రియంగు మొదలైన నవ ధాన్యాలను పోసి..పూజలు చేస్తారు..ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతిగా వుంటాడు.. శుక్లపక్ష చంద్రుడిలా పాళికలలోని నవ ధాన్యాలు కూడా దిన దినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు..అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి..పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు.. తర్వాత పూర్ణ కుంభ ప్రతిష్ట జరుగుతుంది.. పాళికలలో వేసిన నవధాన్యాలకు రోజు నీళ్లు పోసి పచ్చగా మొలకెత్తేలా చేస్తారు.. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టే ఇది అంకురార్పణ అయింది. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణం.. స్వామివారి వాహనమైన గరుడుణ్ణి ఓ నూతన వస్త్రం మీద చిత్రించి… దాన్ని పతాకంలా ఎగురవేస్తారు. ముందుగా ఈ గరుడధ్వజ పటాన్ని ఊరేగిస్తారు. ఉత్సవమూర్తులైన భోగశ్రీనివాస, శ్రీదేవీ భూదేవీల సమక్షంలో దీన్ని ధ్వజస్తంభం మీదకి చేరుస్తారు. మీన లగ్న సమయంలో దీన్ని ఎగురవేస్తారు. ఆలయప్రాంగణంలో ఉన్న ధ్వజస్థంభం మీద శ్రీవారి విజయకేతనంగా ఈ ధ్వజం రెపరెపలాడుతుంది. ఈ పతాకాన్ని ఎగురవేయడంలో ఓ పరమార్థం ఉంది. ధ్వజారోహణం అన్నది ఓ ఆహ్వానం అన్నమాట! అష్టదిక్పాలకులకీ ముక్కోటి దేవతలకీ ముల్లోకాల్లోని యక్ష రాక్షస గంధర్వగణాలకీ ఇది ఓ ఆహ్వాన పత్రంలా భావించబడుతుంది. ఇలా సంప్రదాయ బద్ధంగా ఆహ్వానిస్తే సకల లోకవాసులూ శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకల్ని తిలకించడానికి వస్తారని విశ్వసిస్తారు. ధ్వజారోహణ వేడుకతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్