డెంగ్యూ జ్వరం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

డెంగ్యూ… రోజురోజుకి విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక రోగం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి వందలాది మంది రోగులు హాస్పిటల్స్‌లో మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ జ్వరం మీ దరికి చేరకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.    డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దోమలను పూర్తిగా నియంత్రించాలి నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పుకోవాలి. వేప నూనె, కొబ్బరి […]

డెంగ్యూ జ్వరం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 10:20 AM

డెంగ్యూ… రోజురోజుకి విస్తరిస్తున్న ఈ ప్రాణాంతక రోగం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి వందలాది మంది రోగులు హాస్పిటల్స్‌లో మృత్యువాత పడుతున్నారు. మరి అలాంటి డెంగ్యూ జ్వరం మీ దరికి చేరకుండా ఉండాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  1.    డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి రోగాలు రాకుండా ఉండాలంటే దోమలను పూర్తిగా నియంత్రించాలి
  2. నిద్రించేటప్పుడు కాళ్లు, చేతులను పూర్తిగా కప్పుకోవాలి.
  3. వేప నూనె, కొబ్బరి నూనె కలిపి ఒంటికి పూసుకుంటే.. దోమలు దగ్గరికి రావు.
  4. మస్కిటో కోయిల్స్, ఆల్‌ఔట్ వంటి వాటిని ఉపయోగించాలి.
  5. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి.
  6. బయట తిండి తినకపోవడమే సురక్షితం.
  7. ఫిల్టర్ లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి.
  8.  ఇంటి చుట్టూ నీరు లేకుండా, పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి లేకుండా చూడాలి.
  9. ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి.
  10. పూల కుండీలు, డ్రమ్ములు, డబ్బాల్లో నీరు నిల్వ చేస్తే.. వాటిపై మూతలు సరిగ్గా పెట్టాలి.
  11. దోమల నియంత్రణకు ఫాగింగ్ కూడా అవసరమే.. మునిసిపల్ అధికారులకు చెప్పి ఫాగింగ్ తప్పనిసరిగా చేయించండి