Tim Paine Apologises Ashwin: తాను అలా మాట్లాడడం తప్పే.. భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనన్న కంగారూల కెప్టెన్

తాను స్లెడ్జింగ్‌కు పాల్పడడం తప్పేనని.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని చెప్పడు ఆసీస్ క్రికెట్ సారథి. రవిచంద్రన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యలు చేయడంపై పశ్చాతాపం వ్యక్తం చేశాడు కంగారూల కెప్టెన్‌ పైన్‌...

Tim Paine Apologises Ashwin: తాను అలా మాట్లాడడం తప్పే.. భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనన్న కంగారూల కెప్టెన్
Follow us

|

Updated on: Jan 12, 2021 | 12:56 PM

Tim Paine Apologises Ashwin: తాను స్లెడ్జింగ్‌కు పాల్పడడం తప్పేనని.. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని చెప్పడు ఆసీస్ క్రికెట్ సారథి. రవిచంద్రన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జాతి వివక్షతతో కూడిన వ్యాఖ్యలు చేయడంపై పశ్చాతాపం వ్యక్తం చేశాడు కంగారూల కెప్టెన్‌ పైన్‌. మూడో టెస్టు ముగిసిన అనంతరం ఫైన్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనని.. తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని అన్నాడు.

మూడో టెస్టు చివరి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న వేళ విజయానికి చేరువలో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు విహారి, అశ్విన్ జంటను విడగొట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. అయినా ఆ జంట వీరోచిత పోరాటం ముందు కంగారూల బౌలింగ్ చిన్నబోయింది. దింతో ఆక్రోశంతో క్రికెట్‌లో ఇప్పుడు స్టంప్‌మైక్‌ ఉంటుందనే విషయం మరచిపోయి తన దురుసుతనంతో అశ్విన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. లైయన్‌ బౌలింగ్‌లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని అశ్విన్‌.. క్రీజు నుంచి దూరంగా వెళ్లి తిరిగి వచ్చినపుడు.. ” చివరి టెస్టు వేదికకు వేదికైన గబ్బా కు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఆత్రుతగా ఉన్నా యాష్‌.. చెప్పింది అర్థమైందా.. అంటూ పైన్‌ నోటికి పనిచెప్పాడు. ఈ మాటలకు అశ్విన్ బదులిస్తూ.. మేం కూడా మిమ్మల్ని భారత్‌కు రప్పించాలనే తొందరలో ఉన్నాం.. నీకది చివరి సిరీస్‌ అవుతుందిని సమాధానమిచ్చాడు. ఓ వైపు తన సహచరుడైన విహారీతో అసాధారణ పోరాటం చేసి మ్యాచ్ ను ఓటమినుంచి తప్పించిన అశ్విన్ మరో వైపు.. మీరు బాధపడే విధంగా మాట్లాడితే..మాటకు మాట అప్పగిస్తామనే విధంగా తగిన సమాధానం చెప్పాడు. అయితే చివరి రోజు ఆటలో మూడు క్యాచ్‌లు వదిలేసిన పైన్‌.. ఇలా స్లెడ్జింగ్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Also Read: ఈ ఏడాది ఆరంభమే అదిరిందిగా.. క్రీడాకారుల జీవితంలోకి కొత్త వెలుగులు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బబిత ఫోగట్