ఆ బౌలర్ పగేంటి?..ఛాంపియన్ టీంను అందుకే కుప్పకూల్చాడా?

ఐర్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రోజు లంచ్‌లోపే ఆలౌటయ్యింది. ఇటీవలే వన్టే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్ టీంకు ఇది చాలా చిన్నతనంగా అనిపించే విషయం. పైగా అదేదో బలమైన జట్టు కాదు..పసికూన ఐర్లాండ్. క్రికెట్‌లో సంచలనాలు సహజమే..కానీ ప్రపంచకప్‌కి అర్హత సాధించలేని ఒక జట్టుచేతిలో..10 రోజుల క్రితం ఛాంపియన్‌గా నిలిచిన జట్టు పరాజయం పాలవ్వడం నిజంగా గమనార్హం. కాగా 142 బంతుల్లోనే 85 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం ఐర్లాండ్ పేసర్ […]

ఆ బౌలర్ పగేంటి?..ఛాంపియన్ టీంను అందుకే కుప్పకూల్చాడా?
Follow us

|

Updated on: Jul 25, 2019 | 5:35 AM

ఐర్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రోజు లంచ్‌లోపే ఆలౌటయ్యింది. ఇటీవలే వన్టే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్ టీంకు ఇది చాలా చిన్నతనంగా అనిపించే విషయం. పైగా అదేదో బలమైన జట్టు కాదు..పసికూన ఐర్లాండ్. క్రికెట్‌లో సంచలనాలు సహజమే..కానీ ప్రపంచకప్‌కి అర్హత సాధించలేని ఒక జట్టుచేతిలో..10 రోజుల క్రితం ఛాంపియన్‌గా నిలిచిన జట్టు పరాజయం పాలవ్వడం నిజంగా గమనార్హం.

కాగా 142 బంతుల్లోనే 85 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం ఐర్లాండ్ పేసర్ టిమ్ ముర్తగ్. ఇతడు పుట్టింది, పెరిగింది, క్రికెట్ కెరీర్ మొదలు పెట్టింది ఇంగ్లాండ్‌లోనే. కెరీర్ ఆరంభంలో సర్రే కౌంటీకి ఆడిన టిమ్.. 2005లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లో 24 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20ల్లో అప్పటికే అదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 2007లో మిడిల్‌సెక్స్‌కు మారాడు. 2008 సీజన్లో 104 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. 2011లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 85 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కానీ ఇంగ్లాండ్ సెలెక్టర్లు అతణ్ని పట్టించుకోలేదు. దీంతో ముర్తగ్ ఇంగ్లాండ్‌ను వీడాలని నిర్ణయించుకున్నాడు.

2011 అక్టోబర్‌లో ఐరిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడి తాత ఐర్లాండ్ వాస్తవ్యుడు కావడంతో నాలుగు నెలల్లోనే అతడికి అక్కడి పౌరసత్వం దక్కింది. మిడిల్‌సెక్స్ తరఫున అదరగొట్టిన టిమ్.. ఐర్లాండ్‌కు వరంలా మారాడు. పౌరసత్వం రాగానే ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన టిమ్.. తర్వాత బంగ్లాదేశ్‌పై టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  2015 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ తరఫున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై ఆడిన టిమ్.. తర్వాత గాయం బారిన పడ్డాడు. తర్వాత మళ్లీ కోలుకోని జట్టులో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. తనను ఇబ్బందులు పెట్టిన మేనేజ్‌మెంట్‌పై కసితోనే టిమ్ ముర్తగ్ ఒక్కసారిగా అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌కు కుప్పకూల్చాడని  సోషల్ మీడియాలో న్యూస్ వెల్లువెత్తుతున్నాయి.

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!