Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

టిక్‌టాక్‌ ఎఫెక్ట్: చపాతి కర్రతో.. భార్య హత్య..! అసలేం జరిగింది..?

Tiktok: Husband Murdered by Wife Fathima with chapathi rolling pin in Prakasam, టిక్‌టాక్‌ ఎఫెక్ట్: చపాతి కర్రతో.. భార్య హత్య..! అసలేం జరిగింది..?

పచ్చని సంసారంలో టిక్‌టాక్‌ చిచ్చుపెట్టింది.. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది.. చివరకు ఆ టిక్‌ టాక్‌ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతమయ్యేలా చేశాయి. దీంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. ప్రకాశంజిల్లా కనిగిరిలో జరిగిన ఈ సంఘటన టిక్‌టాక్‌ వీడియోల మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాన్ని మరోసారి బట్టబయలు చేసింది. అసలేం జరిగిందంటే..?

ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచ్చూ.. నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్లూరుకు చెందిన ఫాతిమా టైలర్ పని చేసే పాచ్చును వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా భర్తతో ఫాతిమాకు విభేదాలు ఏర్పడ్డాయి. భార్య ఫాతిమకు వివాహేతర సంబంధం ఉందనీ, నగదు కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ.. ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తుందనే కారణంతో ఇరువురు తరచూ గొడవపడుతుంటారు. రెండు నెలల క్రితం ఫాతిమాకు ఎంపీడీవో ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం వచ్చింది. అంతే కాకుండా టిక్ టాక్‌‌లో తను ఆడుతూ, పాడుతూ చేసిన వీడియోలు అప్లోడ్ చేయడం ఆమెకు ఫ్యాషన్‌గా మారింది.

Tiktok: Husband Murdered by Wife Fathima with chapathi rolling pin in Prakasam, టిక్‌టాక్‌ ఎఫెక్ట్: చపాతి కర్రతో.. భార్య హత్య..! అసలేం జరిగింది..?

భర్త వద్దని వారిస్తున్నా అతని మాట వినకుండా టిక్‌టాక్‌లో వీడియోలు అప్లోడ్ చేసేది.. ఈ విషయంపై భార్యాభర్తలు ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. కాగా.. అప్పటికే.. తన భార్యను అనుమానిస్తున్న పాచ్చూకి.. ఈ టిక్‌టాక్ వీడియోలు మరింత ఆజ్యం పోశాయి. ఆ అనుమనం పెనుభూతంలా మారి ఆమె హత్యకు దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాతిమా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మొదట చిత్రీకరించాడు భర్త పాచ్చూ. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. టిక్‌టాక్‌ వీడియోలు, వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు ఆమె హత్యకు దారితీశాయని పోలీసులు నిర్ధారించారు. చపాతీ కర్రతో తలపై కొట్టి.. గొంతు నొక్కి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భర్త పాచ్చును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.

ఫాతిమా హత్యకు కారణం టిక్‌టాకేనని నిందితుడు సోదరులు చెబుతున్నారు. ఫాతిమాకు టిక్‌టాక్‌లో వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేయడమంటే పిచ్చిగా మారిందంటున్నారు. అయితే తాము గౌరవమైన కుటుంబానికి చెందిన వారమని, సొసైటీలో ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని పలుమార్లు ఫాతిమాకు నచ్చజెప్పినా ఆమె వినలేదని అన్నారు. దీంతో.. పాచ్చూకి కూడా ఆమెపై అనుమానం పెరిగిన నేపథ్యంలో గొడవ జరిగి ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నామని నిందితుడి సోదరుడు చెప్పాడు.