Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

టిక్‌ టాక్ పిచ్చి.. తెలుగమ్మాయి బలి!

Tik Tok Star Sonika Kethavath Sudden Death, టిక్‌ టాక్ పిచ్చి.. తెలుగమ్మాయి బలి!

టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఆన్లైన్‌లో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిని మంచిగా వాడితే ఓవర్‌నైట్ స్టార్ అయిపోతారు. అదే పిచ్చి పీక్స్‌కు చేరి విపరీతంగా వాడితే ప్రాణానికి ముప్పు తెస్తుంది. ఇప్పుడు తాజాగా టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న వైజాగ్ అమ్మాయి విషాద కథ అందరిని కలిచి వేస్తోంది.

టిక్ టాక్ వీడియోలు.. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సోనికా కేతావత్ గురించి సోషల్ మీడియాలో తెలియని వారుండరు. ఉప్పల్ బాలు తన విచిత్రమైన హావభావాలతో టిక్ టాక్‌లో పాపులర్ అయినట్లు సోనికా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో వీడియోలు చేసి విపరీతమైన ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇంకా చెప్పాలంటే ఈమెకు టిక్ టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్‌.. ఇన్‌స్టాలో వేలల్లో అభిమానులు ఉన్నారు. కొందరైతే ఈ అమ్మాయిని సినిమాల్లోకి రావాలని కూడా ఆహ్వానించారు. అలాంటి సెలబ్రిటీగా మారిన ఈ అమ్మాయిని టిక్ టాక్ పిచ్చి తిరిగి రాని లోకాలకు పంపించేసింది.

Tik Tok Star Sonika Kethavath Sudden Death, టిక్‌ టాక్ పిచ్చి.. తెలుగమ్మాయి బలి!

సోనికాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇటీవల స్నేహితులతో కలిసి జాలీగా బైక్ రైడింగ్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో తీస్తుండగానే నల్గొండ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. అతివేగంగా వెళ్తున్న వీరి వాహనం ఎదురుగా వచ్చిన సైకిల్‌ను తప్పించబోయి.. అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది.

గాయపడిన సోనికాను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్న చిన్న గాయాలే తగిలాయి అనుకుని అందరూ కూడా భావించారు. కానీ ఆ గాయాలు శరీరంకు బలంగా తగలడంతో రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించింది. ఇన్ఫెక్షన్ సోకడంతో ఈ టిక్ టాక్ స్టార్ ప్రాణాలు విడిచినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. అయితే ఆమెతో ప్రయాణించిన స్నేహితుడు మాత్రం ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇక సోనికా మరణవార్తతో సోషల్ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి. టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన ఈ తెలుగమ్మాయి.. దానితోనే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పిచ్చి అనేది ఉండవచ్చు గానీ.. అది మన ప్రాణాల మీదకు వచ్చేలా తెచ్చుకోకూడదని యువతను డాక్టర్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.