Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

బిగ్ బాస్‌లో టిక్ టాక్ సెన్సేషన్.. ఎంట్రీతోనే సంచలనం!

Vikas Pathak Tik Tok Star In Bigg Boss 13, బిగ్ బాస్‌లో టిక్ టాక్ సెన్సేషన్.. ఎంట్రీతోనే సంచలనం!

హిందీ బిగ్ బాస్ రోజుకో సస్పెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టింగ్‌కి ఫ్యాన్స్ జేజేలు కొడుతున్నారు. బుల్లితెర, బీ-టౌన్ నుంచి ప్రముఖ సెలబ్రిటీస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలై దాదాపు 6 వారాలు పూర్తి కావడంతో పలువురు ఎలిమినేషన్ అయ్యారు. దీంతో సల్లూ భాయ్ మరికొందరిని హౌస్‌‌లోకి వైల్డ్ కార్డు ద్వారా పంపించాడు. వారిలో రీసెంట్‌గా వెళ్లిన నటుడు వికాస్ జయరాం పథక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

యూట్యూబ్, టిక్ టాక్‌లో ఫేమస్ అయిన వికాస్ పథక్‌ను ‘హిందూస్తాన్ బహు’ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. టిక్ టాక్‌లో సుమారు 6 లక్షల ఫాలోవర్స్ ఉండగా.. యూట్యూబ్‌లో 1.8 మిలియన్ సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇకపోతే వికాస్‌కు సంజయ్ దత్ అంటే అమితమైన ఇష్టం. రీల్ మున్నా భాయ్ మాదిరిగా డ్రెస్ చేసుకుంటూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాడు. ఇదిలా ఉండగా వికాస్ అనుకోకుండా  చేసిన ఒక అభ్యంతరకరమైన వీడియో వల్ల సోషల్ మీడియాలో తెగ పాపులర్ కావడమే కాకుండా దానిపై మెమెస్ కూడా వైరల్ అయ్యాయి. ముంబైలో కుటుంబసమేతంగా నివసిస్తున్న వికాస్.. మధ్యతరగతికి చెందినవాడు. రకరకాల చిరుద్యోగాలు చేసుకుంటూ బ్రతుకు ఛట్రం కొనసాగిస్తున్న అతడికి.. బిగ్ బాస్ నుంచి పిలుపురావడం కెరీర్‌కే ప్లస్ పాయింట్ అని చెప్పాలి.  కామన్ పర్సన్స్‌ను కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ చేయడంతో.. వారిలో ప్రతిభను వెలికితీసినట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే  తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లలోనూ యూట్యూబ్ సెన్సేషన్స్ దీప్తి సునైనా, మహేష్ విట్టా, ఆషు రెడ్డి హౌస్‌లో వచ్చి హంగామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, కత్తి మహేష్, దీప్తి, జాఫర్ వంటి జర్నలిస్ట్స్‌ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.