టిక్ టాక్ పిచ్చి పీక్‌కు చేరితే.. పిచ్చ డేంజర్!

Tik Tok Dangerous Application For Youth, టిక్ టాక్ పిచ్చి పీక్‌కు చేరితే.. పిచ్చ డేంజర్!

టిక్ టాక్.. ఇప్పుడు ఈ యాప్ లేని మొబైల్ అంటూ ఉండదు. మరీ ముఖ్యంగా యువతలోకి టిక్ టాక్ అనే పిచ్చి నరనరాల పాకిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక వీడియో చేస్తూ.. చూస్తూ అందులో మునిగిపోతున్నారు. చాలామంది ఈ పిచ్చిలో పడి లేనిపోని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ప్రాణాలను సైతం పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని ట్రై  చేసినా.. అదీ కూడా జరగలేదు. యథేచ్ఛగా అన్ని మొబైల్ ప్లే‌స్టోర్స్‌లో ఈ యాప్ అందుబాటులోనే ఉంది. మరీ క్లుప్తంగా దీని గురించి చెప్పాలంటే ఇది మనల్ని ఒకరోజులో సూపర్ స్టార్‌ చేయచ్చు.. తేడా వస్తే ప్రాణాలను కూడా తీయచ్చు.

ఇప్పటికే ఈ యాప్ వల్ల చాలామంది యువత ప్రాణాలు కోల్పోయారు. చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తూ వీడియోలను టిక్ టాక్‌లో పోస్ట్ చేయడం యూత్‌కు ఆనవాయితీగా మారింది. దాని వల్ల సుసాధ్యం కానీ విన్యాసాలను సైతం చేస్తూ.. శారీరికంగా దెబ్బలు తగిలించుకోవడమే కాకుండా అది తేడా చేస్తే ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇక లేటెస్ట్‌గా సోషల్ మీడియా స్టార్ సోనికా కేతావత్ మరణం మొత్తం నెట్టింట్లో పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే. కేవలం టిక్ టాక్ మీద ఉన్న పిచ్చి.. ఆమె ప్రాణాలను హరించింది.

రీసెంట్‌గా ఆమె తన స్నేహితుడితో బైక్ రైడింగ్‌కు వెళ్ళింది. ఆ సమయంలో టిక్ టాక్ వీడియో చేస్తుండగా యాక్సిడెంట్ జరిగి.. ఆసుపత్రిలో చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో చివరికి ప్రాణాలు కోల్పోయింది. జరిగిన ప్రమాదం వల్ల గాయాలు తీవ్రంగా తగలడంతో కొద్దిరోజులకు తుదిశ్వాస విధించింది.

ఇలా ఒకరు మాత్రమే కాదు.. చాలామంది టిక్ టాక్ పిచ్చి పీక్స్‌కు చేరి ప్రాణాలు కోల్పోయారు. నిపుణులు సైతం ఇటువంటి యాప్స్‌కు యువత దూరంగా ఉండాలని హెచ్చరించినా.. వారు పట్టించుకోవట్లేదు. ఒకదానిపై పిచ్చి అనేది ఉండవచ్చు.. కానీ అది ప్రాణాల మీదకు వచ్చేలా ఉండకూడదని సైకాలజిస్ట్స్ అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *