ఒరాకిల్ తో డీల్ కుదిరింది, టిక్ టాక్

ఒరాకిల్, వాల్ మార్ట్ తో తమ డీల్ కుదిరిందని టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ ప్రకటించింది. టిక్ టాక్ అధికార ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీకి ఎలాంటి ముప్పును తేకుండా..

ఒరాకిల్ తో డీల్ కుదిరింది, టిక్ టాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 21, 2020 | 5:11 PM

ఒరాకిల్, వాల్ మార్ట్ తో తమ డీల్ కుదిరిందని టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ ప్రకటించింది. టిక్ టాక్ అధికార ప్రతినిధి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీకి ఎలాంటి ముప్పును తేకుండా టిక్ టాక్, ఒరాకిల్, వాల్ మార్ట్  ముందుకు సాగుతాయని ఆయన బీజింగ్ లో తెలిపారు. ముఖ్యంగా భవిష్యత్తులో టిక్ టాక్ కార్యకలాపాలను ఒరాకిల్, వాల్ మార్ట్ పర్యవేక్షిస్తాయని, టిక్ టాక్ గ్లోబల్ పేరిట తమ సంస్థ వ్యవహరిస్తుందని ఆయన వివరించారు. ఒప్పందం ప్రకారం ఒరాకిల్ సంస్థ తమ టెక్నాలజీ ప్రొవైడర్ గా ఉంటుందని, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అవసరాలకు, అమెరికా యూజర్ల డేటాకు ఆ సంస్థే బాధ్యత వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. వాల్ మార్ట్ తో మేం వాణిజ్యపరమైన భాగస్వామ్యాన్ని కూడా కోరుతున్నామన్నారు.

ఇక యుఎస్ లో టిక్ టాక్ తన ప్రధానకార్యాలయాన్ని విస్తరించి 25  వేల మంది ఉద్యోగులను నియమించుకోనుంది. అధ్యక్షుడు ట్రంప్ కూడా వాల్ మార్ట్ భాగస్వామ్యంతో ఒరాకిల్ కంపెనీ.. టిక్ టాక్ ఆపరేషన్స్ కొనుగోలుకు ఆమోద ముద్ర వేశారు. ఈ డీల్ కింద అమెరికాలో ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కింద బైట్ డాన్స్ 5 బిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తుందని ఆయన తెలిపారు.