తెలంగాణలో టిక్‌టాక్ బ్యాన్..?

తెలంగాణలో టిక్‌టాక్ బ్యాన్ కాబోతుందా..? బ్యాన్ చెయ్యాలంటూ తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వెళ్లింది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర పంజాబ్ సహా ఏడు రాష్ట్రాలు హోంశాఖకు ఇదే తరహా లేఖ రాశాయి. టిక్‌టాక్‌కు యువత బానిసైపోతోంది. ఇల్లు, ఆఫీస్, కాలేజ్ అని లేకుండా ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా వీడియోలు సృష్టించి సర్క్యూలేట్ చేస్తోంది. ఈ సరదాతో ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు. నీళ్లలో మునిగి కొందరు, రైల్వే ట్రాక్‌లపై మరికొందరు, సాహసాలు […]

తెలంగాణలో టిక్‌టాక్ బ్యాన్..?
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 7:20 PM

తెలంగాణలో టిక్‌టాక్ బ్యాన్ కాబోతుందా..? బ్యాన్ చెయ్యాలంటూ తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వెళ్లింది. ఇప్పటికే తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర పంజాబ్ సహా ఏడు రాష్ట్రాలు హోంశాఖకు ఇదే తరహా లేఖ రాశాయి.

టిక్‌టాక్‌కు యువత బానిసైపోతోంది. ఇల్లు, ఆఫీస్, కాలేజ్ అని లేకుండా ఎక్కడపడితే అక్కడ, ఎలా పడితే అలా వీడియోలు సృష్టించి సర్క్యూలేట్ చేస్తోంది. ఈ సరదాతో ప్రాణాలు పోయిన ఘటనలు కోకొల్లలు. నీళ్లలో మునిగి కొందరు, రైల్వే ట్రాక్‌లపై మరికొందరు, సాహసాలు చేస్తూ ఇంకొందరు.. ఇప్పటికే ప్రాణాలు తీసుకున్నారు. ఆస్పత్రులు, కాలేజీల్లోనూ టిక్‌టాక్ వినియోగం పెరగడంతో పరిస్థితి అదుపుతప్పింది. విద్యార్థులు డిబార్ అవుతున్నారు. చాలా మంది ఉద్యోగాలు ఊడితున్నాయి.

ఇన్ని రకాల నష్టాలున్న నేపథ్యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. వరుస ఫిర్యాదులు రావడంతో.. కేంద్రం కూడా టిక్‌టాక్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చింది. వారంలో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది.