టిక్‌టాక్ ఎఫెక్ట్‌: 9 మంది ఉద్యోగాలు ఫట్

టిక్‌టాక్ వచ్చిన తర్వాత తమ నట విశ్వరూపాన్ని చూపిస్తూ వీడియోలు అప్‌లోడ్ చేసేస్తున్నారు. విద్యార్థులు, గృహిణు లు, ఉద్యోగులు అనే తేడా లేకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన సమయంలో.. వివిధ పనులపై వచ్చేవారిని పట్టించుకోకుండా.. కాలపక్షేపం చేస్తూ టిక్‌టాక్ వీడియోలు తీసి వదిలారు. ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ […]

టిక్‌టాక్ ఎఫెక్ట్‌: 9 మంది ఉద్యోగాలు ఫట్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 17, 2019 | 1:03 PM

టిక్‌టాక్ వచ్చిన తర్వాత తమ నట విశ్వరూపాన్ని చూపిస్తూ వీడియోలు అప్‌లోడ్ చేసేస్తున్నారు. విద్యార్థులు, గృహిణు లు, ఉద్యోగులు అనే తేడా లేకుండా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే, ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన సమయంలో.. వివిధ పనులపై వచ్చేవారిని పట్టించుకోకుండా.. కాలపక్షేపం చేస్తూ టిక్‌టాక్ వీడియోలు తీసి వదిలారు. ఈ వ్యవహారం మీడియాకు ఎక్కడంతో ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ శ్రీనివాసరావు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.9 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.