Breaking News
  • ఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన.. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం బిల్లు ఉద్దేశం.
  • హైదరాబాద్‌: నెమ్మదిగా దిగి వస్తున్న ఉల్లి ధరలు. అందుబాటులోకి వస్తున్న కొత్త పంట. మలక్‌పేట్‌ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లి. మేలు రకం కిలో రూ.70 నుంచి 90 పలుకుతున్న ఉల్లి . రైతు బజార్లలో రాయితీపై రూ.40కే విక్రయిస్తున్న ప్రభుత్వం. కర్ణాటక, మహబూబ్‌నగర్‌, మెదక్‌ నుంచి వచ్చిన ఉల్లి.
  • ఆర్టీసీ సమ్మె నష్టం అంచనా వేస్తున్న అధికారులు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.400 కోట్ల మేర నష్టం. ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు దాటుతుందని అంచనా.
  • హైదరాబాద్‌: 105 మంది డిగ్రీ కాంట్రాక్ట్‌ లెక్చరర్ల హేతుబద్ధీకరణ. ఇతర కళాశాలలకు బదిలీ చేసేందుకు నేడు కౌన్సెలింగ్‌.
  • నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. అవినీతి నిర్మూలన, రివర్స్‌ టెండరింగ్‌పై నేడు స్వల్పకాలిక చర్చ. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
  • టీఎస్‌ ఆర్టీసీలో అప్రెంటిషిప్‌ అభ్యర్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు. ఈనెల 14న పరీక్షలు నిర్వహించనున్న ఆర్టీసీ . అక్టోబర్‌ 31 నాటికి అప్రెంటిషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు.. ప్రాక్టికల్‌ పరీక్షలు హాజరుకావాలన్న ఆర్టీసీ యాజమాన్యం.

తీహార్ జైలులో సిబ్బంది దారుణం.. ముస్లిం ఖైదీ వీపుపై..

Tihar Jail Officer Brands 'Om' Symbol on Muslim Inmate's Back.. Delhi Court Orders Probe, తీహార్ జైలులో సిబ్బంది దారుణం.. ముస్లిం ఖైదీ వీపుపై..

న్యూఢిల్లీ : దేశ రాజధాని తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. నబ్బీర్ అనే ఓ ముస్లిం ఖైదీ వీపుపై కొందరు జైలులోని సిబ్బంది ‘ఓం’ గుర్తును ముద్రించారు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ సమక్షంలోనే జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ‘మమ్మల్ని అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. మేము మనుషులమే, వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు. అంతే తప్ప ఇందుకు మరే బలమైన కారణాలు లేవు’ అని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో నబ్బీర్ ను మరో జైలుకు తరలించిన డీజీపీ, ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను త్వరలోనే ఢిల్లీ హైకోర్టుకు సమర్పిస్తారని పేర్కొన్నారు.