అనుమానస్పద స్థితిలో.. మూడు పులులు మృతి..!

మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రంలోని అటవిప్రాంతంలో మూడు పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చంద్రపూర్ జిల్లాలోని చిమ్ముర్ తాలూకా పరిధిలో గల బ్రహ్మపురి అటవీ రేంజ్ పరిధిలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. రేంజ్‌లోని మెటేపార్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో నీటి కాలువ వద్ద మూడు పెద్దపులులు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:51 am, Tue, 9 July 19

మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రంలోని అటవిప్రాంతంలో మూడు పులులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చంద్రపూర్ జిల్లాలోని చిమ్ముర్ తాలూకా పరిధిలో గల బ్రహ్మపురి అటవీ రేంజ్ పరిధిలో ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. రేంజ్‌లోని మెటేపార్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో నీటి కాలువ వద్ద మూడు పెద్దపులులు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో.. అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన చోట తల్లి పులితో పాటు రెండు మగ పులి పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నామని చంద్రపుర్ అటవీ డీఎఫ్ ఓకుల్‌రాజ్ సింఘ్ తెలిపారు. అయితే.. ఆ పక్కనే ఓ జంతువు మృత కళేబరం పడిఉండటాన్ని కూడా అధికారులు గమనించారు. ఒకవేళ అది తిని పులులు చనిపోయాయా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులులను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే సారి మూడు పులులు మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.