‘ టైగర్ జిందా హై ‘ కాదు.. ‘ టైగర్ ట్రియంఫ్ ‘ విన్యాసాల వీడియో చూడాల్సిందే !

అగ్రరాజ్యం అమెరికా-భారత ఉమ్మడి సైనిక విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మహా సముద్రంలో వీరు చేస్తున్న కఠినతరమైన విన్యాసాలకు జోహార్ అనాల్సిందే.. ఓ హాలీవుడ్ థ్రిల్లర్ ని మరపించేలా ఈ సైనిక దళాలు పొందుతున్న శిక్షణే ఇలా ఉంటే.. ఇక అసలు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ‘ టైగర్ ట్రియంఫ్ ‘ పేరిట యుఎస్ బీ-రోల్ మిలిటరీ దళాలు, భారత సైనికులు వివిధ చోట్ల పొందిన ట్రైనింగ్ ఈవెంట్లను చూపుతూ…. యుఎస్-థర్డ్ మెరైన్ లాజిస్టిక్స్ […]

' టైగర్ జిందా హై ' కాదు.. ' టైగర్ ట్రియంఫ్ ' విన్యాసాల వీడియో చూడాల్సిందే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 05, 2019 | 3:32 PM

అగ్రరాజ్యం అమెరికా-భారత ఉమ్మడి సైనిక విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మహా సముద్రంలో వీరు చేస్తున్న కఠినతరమైన విన్యాసాలకు జోహార్ అనాల్సిందే.. ఓ హాలీవుడ్ థ్రిల్లర్ ని మరపించేలా ఈ సైనిక దళాలు పొందుతున్న శిక్షణే ఇలా ఉంటే.. ఇక అసలు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. ‘ టైగర్ ట్రియంఫ్ ‘ పేరిట యుఎస్ బీ-రోల్ మిలిటరీ దళాలు, భారత సైనికులు వివిధ చోట్ల పొందిన ట్రైనింగ్ ఈవెంట్లను చూపుతూ…. యుఎస్-థర్డ్ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూపునకు చెందిన జోషువా పింక్నీ రూపొందించిన ఈ వీడియో వావ్ అనిపిస్తోంది.

అమెరికన్-ఇండియన్ దళాల మధ్య తొలి ట్రై సర్వీస్ ఎక్సర్ సైజ్.. విశాఖపట్నంలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానుంది. దానికి ముందే ఈ ఓపెనింగ్ సెరిమనీ వీడియో బయటకి వచ్చింది. సముద్రంలో వీరి సాహసిక విన్యాసాలకు ఇది అద్దం పడుతోంది. ఈ రెండు దేశాల సైనిక సామర్థ్యాన్ని, సత్తాను పెంచేందుకు ఉద్దేశించిన ఈ వీడియోపై మనమూ ఓ లుక్కేద్దాం.. ..