టైగర్! యూ ఆర్ రియల్లీ గ్రేట్!

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ జిమ్‌లో 200 కేజీల బరువు ఎత్తి నెటిజన్ల చేత శభాష్‌ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టైగర్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన అభిమానులు ‘నిజమైన టైగర్, అద్భుతం, ఇది ఎలా సాధ్యమైంది, టైగర్‌ మీరు చేయగలరు, గ్రేట్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖత్తర్‌ కూడా వీడియోను చూసి ‘‘సూపర్‌ […]

టైగర్! యూ ఆర్ రియల్లీ గ్రేట్!
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 11:03 AM

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ జిమ్‌లో 200 కేజీల బరువు ఎత్తి నెటిజన్ల చేత శభాష్‌ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టైగర్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన అభిమానులు ‘నిజమైన టైగర్, అద్భుతం, ఇది ఎలా సాధ్యమైంది, టైగర్‌ మీరు చేయగలరు, గ్రేట్‌..’ అంటూ తెగ కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా వీక్షించారు. బాలీవుడ్‌ నటుడు ఇషాన్‌ ఖత్తర్‌ కూడా వీడియోను చూసి ‘‘సూపర్‌ హ్యూమన్‌’’ అంటూ సరదాగా కామెంట్‌ చేశారు. టైగర్‌ ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఆయన డ్యాన్స్‌కు చాలా మంది ఫిదా అవుతున్నారు. తన డ్యాన్స్‌ వీడియోలను పలు సందర్భాల్లో ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేసి, అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌ ‘వార్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

https://www.instagram.com/p/B1SyIcvnrdz/?utm_source=ig_web_copy_link