Tiger Chases: టూరిస్టు బస్సును వెంటబడి తరిమిన పులి.. వామ్మో !

ఛత్తీస్ గడ్ లోని నందన్వన్ జంగిల్ సఫారీలో ఒక పులి టూరిస్టు బస్సును వెంటబడి తరిమింది. ఈ నెల 14 న కొందరు పర్యాటకులు బస్సులో ఈ వన్యమృగ కేంద్రంలో వెళ్తుండగా.. రెండు పులులు పోట్లాడుకోవడాన్ని చూశారట. అయితే వాటిలో ఒకటి ఈ బస్సును చూసి హఠాత్తుగా ముందుకు వఛ్చి ఈ వాహనం కిటికిలోంచి కిందికి వేలాడుతున్న కర్టెన్ ను నోటితో పట్టేసి వదలకుండా లాగడానికి ప్రయత్నించింది. అదే సమయంలో బస్సుపై దాడికి కూడా యత్నించడంతో.. గైడ్ […]

Tiger Chases: టూరిస్టు బస్సును వెంటబడి తరిమిన పులి.. వామ్మో !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 17, 2020 | 5:59 PM

ఛత్తీస్ గడ్ లోని నందన్వన్ జంగిల్ సఫారీలో ఒక పులి టూరిస్టు బస్సును వెంటబడి తరిమింది. ఈ నెల 14 న కొందరు పర్యాటకులు బస్సులో ఈ వన్యమృగ కేంద్రంలో వెళ్తుండగా.. రెండు పులులు పోట్లాడుకోవడాన్ని చూశారట. అయితే వాటిలో ఒకటి ఈ బస్సును చూసి హఠాత్తుగా ముందుకు వఛ్చి ఈ వాహనం కిటికిలోంచి కిందికి వేలాడుతున్న కర్టెన్ ను నోటితో పట్టేసి వదలకుండా లాగడానికి ప్రయత్నించింది. అదే సమయంలో బస్సుపై దాడికి కూడా యత్నించడంతో.. గైడ్ సూచనపై డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు నడిపాడు. కానీ ఆ పులి పట్టు వదలకుండా కొంతదూరం దాన్ని వెంబడిస్తూ పరుగులు పెట్టింది. మొత్తానికి వాహనం స్పీడందుకోవడంతో అది వెనుదిరిగింది. బస్సులోని టూరిస్టులు బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. అయితే.పులి-బస్సు ఘటనపై స్పందించిన అధికారులు.. బస్సు డ్రైవర్ ను, గైడ్ ను సస్పెండ్ చేశారు. వారిద్దరూ సఫారీ ప్రోటోకాల్ ను నిర్లక్ష్యం చేశారని, టూరిస్టుల భద్రతను గాలికొదిలేశారని వారు ఆరోపిస్తూ ఈ చర్య తీసుకున్నారు. పులి బస్సును వెంబడించిన ఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది.