పెన్‌గంగ నది తీరంలో మరోసారి పులి పంజా.. మేకలకాపరిపై దాడి.. పరిస్థితి విషమం..!

తెలంగాణ-మహారాష్ట్ర డ. మేకలకాపరిపై దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరిచింది.

  • Balaraju Goud
  • Publish Date - 5:52 pm, Fri, 27 November 20

తెలంగాణ-మహారాష్ట్ర డ. మేకలకాపరిపై దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరిచింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామం వద్ద పెన్‌గంగ నది తీరానికి అవతల పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర వగ్యారా గ్రామంలో పెద్ద పులి హల్‌చల్ చేసింది. సేనాపతి బిజారామ్‌ అనే మేకలకాపరిపై గురువారం దాడి చేసింది. పులితో పెనుగులాట అనంతరం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని గ్రామస్తులు యవత్‌మాల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

ఇటీవల భీంపూర్‌ మండల పెన్‌గంగ నది ఒడ్డున ఉన్న గొల్లగడ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర టేంబి పల్లెలో పత్తి చేనులో ఉన్న ముసలమ్మను పులి చంపేసింది. మహారాష్ట్ర ఇవ్‌రీ గ్రామంలో కూడా పులి అప్పుడప్పుడు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలావుంటే, మహారాష్ట్ర తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచే పెన్‌గంగ దారిలో పులులు వలస వస్తున్నాయని అటవీ అధికారులు అంటున్నారు. పులుల సంచారంపై పెన్‌గంగ నది సమీపంలో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు పల్లెల్లో ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఏమాత్రం అనవాళ్లు కనిపించిన సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.