బీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం..

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చంఢీఘడ్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటుగా.. పిడుగులు కూడా పడే ప్రమాదముందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని.. వాతావరణశాఖ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కోస్తా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ ఘడ్, అండమాన్ […]

బీ అలర్ట్.. ఆ రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 5:28 PM

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చంఢీఘడ్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో గాలి దుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటుగా.. పిడుగులు కూడా పడే ప్రమాదముందని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని.. వాతావరణశాఖ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కోస్తా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, విదర్భ, చత్తీస్ ఘడ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అరేబియా సముద్రం మీదుగా బంగాళాఖాతం వరకు సముద్రం అల్లకల్లోలంగా మారిందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.