Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • విజయవాడ: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యం. గత నెల 24వ తేది అర్దరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి. అనంతరం మార్చూరుకి తరలించిన వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం. వృద్ధుడు వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయని సిబ్బంది. దింతో మిస్టరీగా మరీనా వసంతారావు మిస్సింగ్. పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరిన సరైన వివరణ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తో గత 10 రోజులుగా ఆందోళనలో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు తీరు పై కుటుంబ సభ్యులు ఆగ్రహం. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించిన పోలీసులు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో విషాదంలో కుటుంబo.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ రిజర్వ్ చేసిన హైకోర్టు. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన విచారణ. ప్రైవేటు హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును కోరిన మాజీ మంత్రి . తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. తీర్పు రేపటికి వాయిదా . అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న అచ్చెన్నాయుడు తరుపు న్యాయవాది. అనారోగ్యంతో ఉన్న అచ్చెన్నాయుడుకు సహాయకుడు అవసరం. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం అవరమయ్యే ఖర్చులు అచ్చెన్నాయుడే భరిస్తాడని కోర్టుకు తిలిపిన న్యాయవాది.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. ఉపరితల ఆవర్తనం తో పాటు షీర్ జోన్ ఏర్పడింది. ఆంధ్ర తీరానికి సమీపంలో కేంద్రీక`తమైన ఆవర్తనం. పశ్చిమ బంగాళాఖాతం లో 3.1 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. - వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు రాజారావు.
  • క్లినికల్ ట్రైల్స్ కు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ . నిమ్స్ కు పర్మిషన్ ఇచ్చిన ఐసీఎంఆర్ . ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కిమ్స్. అనేకసార్లు అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించిన నిమ్స్.

బ్రేకింగ్: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.....
Three Terrorists killed in Pulwama Encounter, బ్రేకింగ్: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్ము కశ్మీర్‌ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టులు ఉన్నారన్న ఖచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. జవాన్లు ధీటుగా స్పందించారు. దీంతో పోలీసుల, ముష్కరుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారి వివరాలను సేకరించగా.. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని గుర్తించారు. వారిలో ఒక ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

Read More:

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత

Related Tags