పీఓకే లో మళ్ళీ టెన్షన్.. పాక్ శిబిరాలపై భారత ఆర్మీ దాడులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆ దేశ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్ లపైనా భారత జవాన్లు విరుచుకపడ్డారు. ఈ ఆర్టిల్లరీదాడుల్లో ఆరుగురు నుంచి సుమారు 10 మంది వరకు పాక్ సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. పీఓకె లోని నీలం లోయలో ఈ నెల 20 న ఈ దాడులు జరిగాయి. భారత సైనికుల కాల్పుల్లో దాదాపు నాలుగు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్టు రావత్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని […]

పీఓకే లో మళ్ళీ టెన్షన్.. పాక్ శిబిరాలపై భారత ఆర్మీ దాడులు
Follow us

|

Updated on: Oct 23, 2019 | 2:00 PM

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆ దేశ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్ లపైనా భారత జవాన్లు విరుచుకపడ్డారు. ఈ ఆర్టిల్లరీదాడుల్లో ఆరుగురు నుంచి సుమారు 10 మంది వరకు పాక్ సైనికులు మరణించారని, పలువురు గాయపడ్డారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. పీఓకె లోని నీలం లోయలో ఈ నెల 20 న ఈ దాడులు జరిగాయి. భారత సైనికుల కాల్పుల్లో దాదాపు నాలుగు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్టు రావత్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని తంగ్ ధర్ సెక్టార్ లో గల జనావాసాలను టార్గెట్ చేస్తూ పాక్ సైనికులు కాల్పులకు దిగడంతో ఆ దాడులను తిప్పికొట్టేందుకు మన జవాన్లు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆ దేశ మిలిటరీ స్థావరాలమీద ఎటాక్ చేశారని రావత్ వివరించారు. అయితే తమ స్థావరాలపై ఈ దాడి జరిగిందన్న వార్తను పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ ఖండించారు. కావాలనే ఇండియా ఈ తప్ప్పుడు ప్రచారం చేస్తోందని, వీటి నిర్ధారణకు ఆయా దేశాల దౌత్యాధికారులను సదరు ప్రాంతానికి రప్పించే ఏర్పాటు భారత్ చేసుకోవచ్ఛునని ఆయన అన్నారు. కాగా-2016 సెప్టెంబరులో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ దాడులతో వీటిని పోల్చరాదని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఏమైనా.. నియంత్రణ రేఖ వద్ద గట్టి నిఘా ఉన్న కారణంగా అవతలివైపు నుంచి పాక్ ఉగ్రవాదులు అక్రమంగా కాశ్మీర్లోకి చొచ్ఛుకురాలేకపోతున్నారని ఈ వర్గాలు తెలిపాయి.