అదృశ్యమయ్యారు.. చివరకు శవాలై తేలారు

Three students drown at quarry in Nizamabad, అదృశ్యమయ్యారు.. చివరకు శవాలై తేలారు

నిజామాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగారంలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్ధులు కుంటలో శవాలై తేలారు. విద్యార్ధుల మృతితో వారి కుటుంబాల్లో విషాద చాయలు నెలకొన్నాయి. విద్యార్ధులు స్కూల్‌కు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఐదో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చివరకు ఓ కుంటలో అదృశ్యమైన విద్యార్ధులు మృతదేహాలై కనిపించడం చూశారు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గజ ఈతగాళ్లు, ఫైరింజన్లతో గాలింపు చర్యలు చేపట్టడంతో విద్యార్ధుల మృతదేహాలు బయటపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *