విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

Kamareddy Three persons got electrocuted, విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

విద్యుదాఘాతంతో ముగురు రైతులు ఒక్కసారే మృతిచెందిన దుర్ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామ శివారులోని స్వామి గౌడ్ పంట పొలంలో చెడిపోయిన బోరులోని మోటారును తీయడానికి వెళ్ళిన ముగ్గురు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. మృతి చెందిన వారిలో మురళీధర్ రావు(55),  ఇమ్మడి నారాయణ (40), లక్ష్మణ రావు( 60)లు ఉన్నారు. ముగ్గురు చెడిపోయిన బోరు మోటారుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో బోరు మోటారు పైపులు పైకి తీస్తుండగా, పైన విద్యుత్ వైర్లకు పైపు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పక్కపొలాల్లో ఉన్నరైతులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించిన పోలీసులు..మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే సారి గ్రామంలోని మూడు కుటుంబాల్లో సంభవించిన అకాల మరణాలతో ఎల్పుగొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *